టీ20 ప్రపంచ కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. అనూహ్య సంఘటనలు, ట్విస్టులు, పరిణామాల మధ్య నాలుగు జట్లు సెమీస్ లోకి ఎంటరయ్యాయి. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాక్ జట్లు సెమీస్ లోకి అడుగపెట్టాయి. ఇక మిగిలిందల్లా నాకౌట్ సమరమే. గెలిచిన జట్టు ముందుకెళ్లడం.. ఓడిన జట్టు ఇంటి దారి పట్టడం. ఈ క్రమంలో భారత జట్టు, ఇంగ్లాండ్‌తో అమీ.. తుమీ.. తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు నిండి ఉండడంతో హోరాహోరీ ఫైట్ తప్పకపోవచ్చు. అయితే.. టీమిండియా మాత్రం ఒకే ఒక్క ప్లేయర్ విషయంలో ఆందోళన చెందుతోంది. అతనే సామ్ కర్రన్.
ఆల్ రౌండర్ గా సామ్ కుర్రాన్ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడు. ఈ టోర్నీలో బ్యాటర్ గా పెద్దగా రాణించనప్పటికీ బౌలింగ్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. వేసేది మీడియం పేస్ అయినా.. స్లో బాల్స్, కట్టర్స్ తో ఆశించిన ఫలితాన్ని రాబడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడిన సామ్ కర్రన్ 10 వికెట్లు తీశాడు. ఇందులో 7 వికెట్లు ఆఖరి ఓవర్లలోనే తీయడం గమనార్హం. ఆఫ్ఘాన్‌పై 5 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్న కర్రన్, ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్ పై 2, శ్రీలంకపై ఒక వికెట్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో పరుగులివ్వకూండా బాగా కట్టడి చేస్తున్నాడు. అందులోనూ భారత జట్టుపై సామ్ కర్రన్‌కి తిరుగులేని రికార్డు ఉంది. అదే జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది.
Super 12s = Super Sam Curran 🦸♂️
Out of the 88 balls he’s bowled, 42 have been dot balls 🤯#T20WorldCup pic.twitter.com/34LfTXonGz
— England’s Barmy Army (@TheBarmyArmy) November 7, 2022
జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్, మొయిన్ ఆలీ, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోన్స్.. ఇలా ఎంతమంది హిట్టర్లున్నా ఇండియాపై వీరికి చెప్పుకోదగ్గ రికార్డు ఏమీ లేవు. వీళ్లని అవుట్ చేయడం మన బౌలర్లకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కానీ, చిచ్చరపిడుగు సామ్ కర్రన్ తో అసలు సమస్య. భారత జట్టుపై 7 టెస్టుల్లో 346 పరుగులు చేసిన సామ్ కర్రన్, బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. అలాగే.. 3 వన్డేల్లో 107 సగటుతో 107 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు ఎలా ఉన్నా.. ప్రస్తుత ప్రపంచ కప్ లో అతడి ప్రదర్శన మాత్రం ఇబ్బంది పెట్టేలా ఉంది. ఒకవేళ భారత బ్యాటర్లు అతడిని దీటుగా ఎదుర్కోగలిగితే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
Sam Curran has been incredible in the death overs 💪#T20WorldCup pic.twitter.com/f85bWMh6Sm
— ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2022
India Vs England Semi Finals promo. pic.twitter.com/moeKkp9Pfi
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022