టీ20 వరల్డ్ కప్ 2022లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే సూపర్ 12లో 193.96 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు. సూపర్ 12లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అయితే సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపించాడు. కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. విరాట్ కోహ్లీకి తోడు సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో సూపర్ ఫామ్ వల్ల టీమిండియా గ్రూప్ బీ టేబుల్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. గురువారం పటిష్టమైన ఇంగ్లండ్‌తో రెండో సెమీస్‌లో భారత్ తలపడనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్ మొయిన్ అలీ.. సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడని.. ప్రస్తుతం అనే ప్రంపచంలో బెస్ట్ అని కితాబిచ్చాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ గతంలో ఇంగ్లండ్ జట్టుపై విరుచుకుపడిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఈ ఏడాది జులై 10న ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడని.. అతన్ని తానే అవుట్ చేసినా.. అప్పటికే అతను తన బౌలింగ్ పిచ్చికొట్టుడు కొట్టాడని మొయిన్ అలీ పేర్కొన్నాడు.
‘సూర్యకుమార్ యాదవ్ మాపై సెంచరీ నమోదు చేశాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ గొప్ప ఇన్నింగ్స్. అతను అలసిపోయిన తర్వాత అతన్ని అవుట్ చేశాను. అప్పటికే అతను నా బౌలింగ్‌లో భారీగా పరుగులు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్సింగ్స్ మాత్రం హైలెట్‌గా నిలిచింది. సూర్య తన ఆటతో టీ20 క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రపంచంలో అతనే బెస్ట్’ అని మొయిన్ అలీ పేర్కొన్నాడు. అయితే.. సెమీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కట్టడి చేస్తామని ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్లోక్స్ పేర్కొన్నాడు. మరీ.. సూర్య తన ఫామ్‌ను సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా కొనసాగిస్తాడా? లేక ఇంగ్లండ్ బౌలర్లకు వికెట్ సమర్పించుకుంటాడా అనేది చూడాలి.
Moeen Ali said, “Suryakumar Yadav has taken T20 cricket to another level. He’s the best in the world”.#SuryakumarYadav pic.twitter.com/8PWpAQI3zq
— Aadesh Yadav (@AadeshyadavAP) November 8, 2022