‘అదృష్టం అడ్డం తిరిగితే అంటిపండు తిన్నాసరే పన్ను ఇరుగుద్ది’.. ఇది ‘వేదం’లో డైలాగ్ కావొచ్చు. సినిమా వచ్చి 12 ఏళ్లు అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే రియాలిటీ జరిగింది. చూసిన వాళ్లందరూ కూడా అయ్యో అనుకునేలా చేసింది. లేకపోతే ఏంటి అసలు.. మరో మూడే మూడు నిమిషాలు వర్షం పడకపోయిన్నా, లేదంటే కాస్త త్వరలో ఓవర్ వేసి ఉన్నా రిజల్ట్ వేరేలా ఉండేది. ఏం చేస్తాం. బ్యాడ్ లక్ ఇంతలా వెంటాడుతుంటే.. గెలవాల్సిన మ్యాచ్ కూడా గంగపాలు అయిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బింబాబ్వే… టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 9 ఓవర్లకు కుదించిన ఈ ఇన్నింగ్స్ లో బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం సఫారీ జట్టు ఇన్నింగ్స్ మొదలవడానికి ముందు వర్షం పడింది. దీంతో 7 ఓవర్లలో 64 పరుగులకు లక్ష్యాన్ని కుదించారు. ఇక దక్షిణాఫ్రికా.. మూడు ఓవర్లలోనే 51 పరుగులు చేసి గెలవడానికి రెడీ అయిపోయింది. ఇలాంటి టైంలో తిరిగి వర్షం పడింది. ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ ని రద్దు చేశారు.
మూడే మూడు నిమిషాలు వర్షం పడకపోయింటే.. దక్షిణాఫ్రికా మరో ఓవర్ లో టార్గెట్ ఫినిష్ చేసేది. కానీ దురదృష్టం, దక్షిణాఫ్రికా జట్టుని మరీ ఇంతలా వెంటాడుతుంటే ఏం చేస్తారు చెప్పండి. సఫారీలకు ఇలా జరగడం ఇదేం కొత్త కాదు.. 1992లోనూ వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇలాంటి బ్యాడ్ లక్ దక్షిణాఫ్రికా జట్టుకి శాపంలా మారింది. సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు.. టార్గెట్ వైపు దూసుకెళ్లింది. 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో వర్షం పడింది. పది నిమిషాలు పడిన తర్వాత ఆగిపోయింది. ఇక టార్గెట్ ఫినిష్ చేద్దామనుకునే సరికి.. దక్షిణాఫ్రికా జట్టు 1 బంతికి 22 పరుగులు చేయాలని అంపైర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయంతో గెలవాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీన్నిబట్టి చూస్తుంటే 30 ఏళ్లయినా సరే దురదృష్టం.. దక్షిణాఫ్రికా జట్టునే పట్టుకుని తిరుగుతోంది. మరి ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
South Africa should consider organising own World Cup. Year I said it!!!
If their Thursday Match gets rained out. It’s been 30Flippin Years. And we have played the best Cricket 🏏by any Nation and everywhere. It is us who made Cricket Great again. So… ya!!! #ZIMvsSA
— rhe_ball_sport : FREEDOM via SPORT (@SportRhe) October 24, 2022
South Africa getting shafted by the rain in a limited overs World Cup held in Australia
Have we seen this somewhere earlier? 🤔#ZIMvsSA #T20WorldCup pic.twitter.com/0rkAHoPA9X
— El Chopernos (@El_Chopernos) October 24, 2022