సాధారణంగా క్రికెట్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం వాటిని చూస్తే అస్సలు నమ్మలేం కూడా. అవి కాకతాళియమో లేక యాదృచ్చికంగానో జరుగుతూంటాయి. అయితే ఈ క్రమంలోనే సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ రిలీ రోసోవ్ చిత్ర విచిత్రమైన స్కోర్లతో సగటు క్రీడాభిమానులతో పాటుగా.. క్రీడానిపుణులను సైతం తన స్కోర్లతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. దీనికి సాక్ష్యం గత 5 ఇన్నింగ్స్ ల్లో అతడు నమోదు చేసిన స్కోర్లే. మ్యాచ్ లో రోసొవ్ కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్ గా వెనుదిరగడం. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రిలీ రోసొవ్.. సౌతాఫ్రికా జట్టులోకి 2014 లో అడుగుపెట్టిన ఇతడు.. తక్కువ కాలంలోనే జట్టులో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆరంభంలో అద్బత ప్రదర్శన చేసిన రోసోవ్.. ఆ తర్వాత ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. తక్కువ మ్యాచ్ లు ఆడి, తక్కువ అనుభవమే ఉన్నప్పటికీ.. అతడిపై నమ్మకంతో జట్టులోకి తీసుకున్నాడు సౌతాఫ్రికా కెప్టెన్ భవూమా. అయితే అతడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రోసొవ్ ఆడుతున్నప్పటికీ.. స్థిరమైన ప్రదర్శన మాత్రం చేయలేక పోతున్నాడు. ఇక రోసొవ్ గత 5 ఇన్నింగ్స్ లను ఒక సారి పరిశీలిస్తే.. గత నెలలో టీమిండియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరిగింది. దాంట్లో తొలి రెండు టీ20ల్లో డకౌట్ గా వెనుదిరిగాడు రోసొవ్. తర్వాత జరిగిన చివరి టీ20 లో చెలరేగి ఆడిన రోసొవ్ 48 బంతుల్లోనే సెంచరీ బాది సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెంటనే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 56 బంతుల్లో శతకంతో మెరిశాడు. దాంతో టచ్ లోకి వచ్చాడు అనుకున్న రోసొవ్.. తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో 2 బంతుల్లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. దాంతో ఇతడిపై ఒక రకమైన అభిప్రాయం ఇటు అభిమానుల్లో.. అటు క్రీడానిపుణుల్లో ఏర్పడింది. కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! అని నిర్ధారించుకున్నారు. ఇక వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తన తర్వాతి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడబోతోంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. డకౌట్ అయిన తర్వాత సెంచరీ చేసే రోసొవ్ పాక్ తో మ్యాచ్ లో ఏం చేస్తాడో వేచి చూడాలి మరి.
Rilee Rossouw last 5 T20I innings:
0(2)
109(56)
100*(48)
0(1)
0(2)— 12th Khiladi (@12th_khiladi) October 30, 2022