ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ని వర్షం వెంటాడుతోంది. మొన్నటికి మొన్న వర్షం వల్ల గెలవాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. ఇప్పుడు అదే వర్షం దెబ్బకు మరో మ్యాచ్ బలైపోయింది! ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. మరో 5 పరుగులు అదనంగా చేసుంటే ఇంగ్లాండ్ గెలిచేది. కానీ ఏంచేస్తాం.. ఇంగ్లాండ్ బ్యాడ్ లక్ అలా రాసిపెట్టుంది మరి. ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్స్ కూడా పడుతున్నాయి.
ఇక విషయానికొస్తే.. మెల్ బోర్న్ వేదికగా బుధవారం, ఐర్లాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. 12 ఓవర్ల 103-2 పరుగులతో ఓ దశలో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బల్బరీన్ మాత్రమే 62 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ టకర్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు అందరూ నామమాత్ర స్కోర్లకు పరిమితమయ్యారు.
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే జాస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఐర్లాండ్ బౌలర్లు వరసగా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. దీంతో ఇంగ్లీష్ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. వీళ్ల బ్యాటింగ్ చూస్తున్న వారందరూ కూడా ఇంగ్లాండ్ జట్టు ఓడిపోతుందని ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. అలా 14.3 ఓవర్లు అయ్యేసరికి వర్షం పడింది. దీంతో మ్యాచ్ ని ఆపేశారు. ఇక మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ని చూశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 110 పరుగులు చేయాల్సి ఉండగా, 5 పరుగుల వెనకే ఉండిపోయింది. దీంతో ఐర్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచింది.
AN HISTORIC WIN FOR IRELAND 🙌#T20WorldCup | #IREvENG pic.twitter.com/QvLpQYRpSL
— ICC (@ICC) October 26, 2022