ఒత్తిడిలో నరాలు తెగడం అంటే ఎలా ఉంటుందో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసినవాళ్లనడిగితే సరిగ్గా అర్థమై ఉంటుంది. బంతి బంతికి విజయం దోబూచులాడుతున్న తరుణాన విరాట్ కోహ్లీ తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని మేల్కొలపడంతో దాయాది జట్టు పాకిస్తాన్ పై మరుపురాని విజయాన్ని అందుకుంది. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశ నుంచి భారత్ ను గెలిపించేంతవరకు కోహ్లీ చేసిన పోరాటం క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయాలతో లిఖించదగిందే. అయితే.. తన ఇన్నింగ్స్ ఆరంభంలో తనే ఈ మ్యాచ్‌ను చెడగొడుతున్నానని అనుకున్నాడట. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు.. రన్ మెషీన్.
పాక్ నిర్ధేశించింది నామమాత్రపు లక్ష్యమైనా.. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు పవర్ ప్లే ముగిసేరకే పెవిలియన్ చేరిపోయారు. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15).. ఇలా వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో జట్టు భారాన్ని భుజాలపై వేసుకున్న విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో), హార్దిక్ పాండ్యా(40)తో కలిసి అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే.. కోహ్లీ క్రీజులోకి వచ్చే సమయానికి జట్టు స్కోర్.. 7/1. ఆ తర్వాత వెంట వెంటనే రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(15), అక్షర్ పటేల్(2) కూడా పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు 31/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అప్పటికి కోహ్లీ 21 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు.
The best video on today’s magic match lead by Virat Kohli. pic.twitter.com/z0Zxt7smw6
— Johns. (@CricCrazyJohns) October 23, 2022
ఈ సమయంలో కోహ్లీ తను అసహనానికి గురైనట్లు తెలిపాడు. “మొదటి 21 బంతుల్లో 12 పరుగులు చేసినప్పుడు నేను మ్యాచ్ చెడగొట్టేస్తున్నానేమో అనిపించింది. సింగిల్స్ రొటేట్ చేస్తున్నప్పటికీ బంతిని గ్యాప్స్‌లోకి పంపలేకపోయా. అయితే చివరి వరకూ క్రీజులో ఉండటం ఎంత అవసరమో నాకు తెలుసు. జట్టులో నా పాత్ర ఎప్పటి నుంచో అదే. అందుకే చివర్లో భారీ షాట్లు ఆడొచ్చనే నమ్మకంతో అలానే కొనసాగించా..” అని తెలిపాడు. కోహ్లీ, పాండ్యా కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగులపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత పాండ్యా అవుటైనా కోహ్లీ తన అనుభవం నేర్పిన పాఠాలతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Of special knocks, game-changing sixes & thrilling victory at the MCG! 👌 💪
𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹: Men of the moment – @imVkohli & @hardikpandya7 – chat after #TeamIndia beat Pakistan in the #T20WorldCup. 👏 👏 – By @RajalArora
Full interview 🎥 🔽 #INDvPAKhttps://t.co/3QKftWa7dk pic.twitter.com/sK7TyLFcSI
— BCCI (@BCCI) October 24, 2022