‘సూర్య కుమార్ యాదవ్ ఓ ఏలియన్ లా కనపడుతున్నాడు’. ‘సూర్య కొట్టే షాట్స్ ఇంతవరకు మేం చూడలేదు’ అతడో మృగం.. నిర్దాక్షిణ్యంగా బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు’ ప్రపంచంలో ఇలాంటి బ్యాట్స్ మెన్ ను ఇంతవరకు చూడలేదు’ అదీకాక టీ20 ఫార్మాట్ లో సూర్య భాయ్ ని మించిన వారు లేరు” సూర్య కుమార్ పై ఈ పొగడ్తలన్నీ ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా మారుమ్రోగిపోతున్నాయి. ప్రపంచ దిగ్గజాలు అందరూ సూర్యకుమార్ ఆటను మెచ్చుకున్నవారే. అయితే న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టీమ్ సౌథీ మాత్రం సూర్యకుమార్ అంత గొప్ప ఆటగాడేమీ కాదని, ఉత్తమ బ్యాట్స్ మెన్ కావాలంటే అతడు ఇలానే తన బ్యాటింగ్ ను కొనసాగించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
సూర్య కుమార్ యాదవ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో సైతం తన జోరును కొనసాగిస్తూ.. సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఇదే మ్యాచ్ లో కివిస్ బౌలర్ సౌథీ హ్యాట్రిక్ తీసి రికార్డు సాధించాడు. ఈ క్రమంలో సూర్య కుమార్ బ్యాటింగ్ గురించి స్పందించాడు టీమ్ సౌథీ. సూర్య భాయ్ ను ప్రశంసిస్తూనే వ్యంగ్యాస్త్రాలు విసిరాడు ఈ న్యూజిలాండ్ పేసర్. సౌథీ మాట్లాడుతూ..”టీమిండియాలో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. గత కొంత కాలంగా భారత జట్టులోకి నైపుణ్యం గల యువ క్రికెటర్లు వస్తున్నారు. ఇలా వచ్చే ప్లేయర్స్ లో కేవలం టీ20లు ఆడే వారు మాత్రమే కాకుండా వన్డేలు, టెస్టు ఫార్మాట్లలో రాణీంచే సత్త కూడా వారికి ఉందనేది కాదనలేని వాస్తవం. ఇక టీమిండియా మిస్టర్ 360 గా పిలుచుకునే సూర్య కుమార్ గత ఏడాదిగా అద్బుతంగా రాణిస్తున్నాడు. కొన్నిరోజులుగా అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు” అని ప్రశసంసిచాడు సౌథీ.
ఇక సూర్య మైదానంలో కొట్టే షాట్స్ అద్భుతం. టీ20 లీగ్ లే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో సైతం అదరగొడుతున్నాడని సౌథీ పేర్కొన్నాడు. అయితే ఉత్తమ బ్యాటర్ గా నిలవాలి అంటే ఇదే ఫామ్ ను కొనసాగించాలని ఈ సందర్భంగా సౌథీ చెప్పుకొచ్చాడు. కొన్ని మ్యాచ్ ల్లో రాణించినంత మాత్రానా గొప్ప బ్యాట్స్ మెన్ కాలేరని వ్యంగ్యంగా అన్నాడు సౌథీ. గొప్ప ఆటగాడు అని పిలవాలంటే కంటీన్యూస్ గా పరుగులు చేయాలని సౌథీ సూచించాడు. ఇక హ్యాట్రిక్ తీసినప్పటికీ జట్టు గెవలకపోవడం పై స్పందిస్తూ.. కొన్ని సార్లు అత్యుత్త ప్రదర్శన చేసినప్పటికీ జట్టు విజయం సాధించలేదని తెలిపాడు. చివరి ఓవర్లు వేయడం నేను అదృష్టంగా భావిస్తానని ఈ సందర్భంగా టీమ్ సౌథీ చెప్పుకొచ్చాడు. అయితే సౌథీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు మండిపడుతున్నారు. పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం మానీ బౌలింగ్ బాగా ప్రాక్టీస్ చేయ్ అని అంటున్నారు.