కరోనా మహమ్మారి వల్ల ఐపీఎల్ సీజన్ 14కు బ్రేక్ పడినా.. సెకెండ్ హాఫ్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఐపీఎల్‌లోని అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. బయోబబుల్‌లో ఆటగాళ్లు సాధన షురూ చేశారు. వ్యక్తిగత కారణాలు, పలు సమస్యలతో కొందరు ప్లేయర్లు సీజన్‌కు దూరమయ్యారు. ఆ జట్లు తమ రీప్లేస్‌మెంట్ ప్లేయర్లను కూడా ప్రకటించాయి. సెప్టెంబర్ నెల ప్రారంభంతో ఐపీఎల్ అప్‌డేట్లు, ఆటగాళ్ల సందడి జోరందుకుంది.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా సెకెండ్ హాఫ్‌కు సమాయత్తమౌతోంది. హైదరాబాద్ టీమ్ ప్రధాన ప్లేయర్లు డేవిడ్ వార్నర్, కేన్ విలయమ్సన్ నెట్స్‌లో సందడి చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన ఏమీ లేకపోయినా.. సెకెండ్ హాఫ్ అయినా మంచి ప్రదర్శన చేయాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నెట్స్‌లో వార్నర్ చూసి జట్టులో స్థానం ఖాయం అనే అనుకుంటున్నారు. ఐపీఎల్ కెరీర్‌లోనే కెరీర్‌లోనే అతి తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఫామ్ కోల్పోయి చాలా కష్టపడుతున్న వార్నర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
ప్రస్తుతానికి ఒకటే విజయం, 6 ఓటములతో 2 పాయింట్లు సాధించి -0.62 నెట్ రన్ రేట్‌తో పాయిట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరి ఇక నుంచి ఎలాంటి ప్రభావి చూపిస్తుందో చాడాలి. బ్యాక్ ఇన్ యూఏఈ అంటూ వారి ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.