ఐపీఎల్ సమరానికి మరి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు షురూ అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ తమ ఫ్యాన్స్‌కు జెర్సీలను ఫ్రీగా పంచేందుకు రెడీ అవుతుంది. ఆ ఫ్రీ జెర్సీలను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.
మరికొన్ని రోజుల్లో ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి క్రికెట్ అభిమానులను క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లను ఒక దగ్గరకు చేర్చి ప్రాక్టీస్ మొదలెట్టించాయి. భారత జట్టు నుంచి ప్రధాన ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించుకుని, ప్రాక్టీస్ ప్రారంభిస్తే.. ఐపీఎల్ పండగ వాతావారణం వచ్చేసినట్టే. ఈ క్రమంలో ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలను మొదలుపెట్టారు. క్రికెట్ అభిమానులు సైతం టిక్కెట్లను కొనుక్కునేందుకు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది.
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఫ్యాన్స్‌కు ఫ్రీగా జెర్సీలు పంచేందుకు సిద్ధమైంది. సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు జెర్సీలు ఫ్రీగా ఇవ్వడంతో టీమ్‌కు సపోర్ట్ పెంచాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫ్యాన్ జెర్సీలను అభిమానులు ఉచితంగా పొందాలంటే మాత్రం ఇలా చేయాలి. రెండు ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ జెర్సీలను అందించనున్నారు. అయితే.. ఇంకేందుకు ఆలస్యం మీకూ సన్‌రైజర్స్ ఫ్యాన్ జెర్సీ కావాలంటే వెంటనే రెండు ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకోండి.. జెర్సీని ఫ్రీగా పొందండి. సన్‌రైజర్స్ హోం మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. టిక్కట్లను పేటియం ఇన్‌సైడర్‌లో పొందొచ్చు. మరి ఈ ఫ్రీ జెర్సీ కాన్సెప్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SRH is giving a fan jersey for free for every two tickets bought by a fan.
Nice gesture by Sunrisers Hyderabad.
— Johns. (@CricCrazyJohns) March 13, 2023