ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు జోష్ ఇచ్చే న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ధోనీని మెంటర్‌గా నియమించడం. ఆ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ మెంటర్‌గా ధోని అనగానే మాజీలు సహా ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన భారత కెప్టెన్‌గా ధోనీ అనుభవం, వ్యూహాలు, ప్రణాళికలు ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌కి బాగా ఉపయోగపడతాయి.
కానీ, సునీల్ గవాస్కర్ మాత్రం కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. మెంటర్‌గా ధోనీ ఓకే గానీ, మరి రవిశాస్త్రికి ధోనికి గొడవలు కాకుండా ఉంటాయా? అన్న సందేహాన్ని వెల్లిబుచ్చారు. ‘‘ధోనీని మెంటార్‌గా నియమించడం భారత జట్టుకు మంచి బూస్టింగ్ అంశం.. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆడే రోజుల్లో ధోనీని మించిన విధ్వంసకర ప్లేయర్ లేడు. మెంటార్‌గా అతని నియామకం జట్టుకి శుభవార్త. కానీ.. హెడ్ కోచ్ రవిశాస్త్రి, ధోనీ మధ్య గొడవలు రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ధోనీ, రవిశాస్త్రికి ఒకేలాంటి ఆలోచనలు ఉంటే.. అది టీమిండాకి అతిపెద్ద శుభవార్తే అవుతుంది’’ అంటూ గవాస్కర్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్ మార్పు, వ్యూహరచన అంశాల్లో వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పరోక్షంగా గవాస్కర్ హెచ్చరించాడు. అదే గనుక నిజమైతే టీమిండియాకు పెద్ద షాకే అవుతుంది. మెంటర్‌గా కూడా ధోనీ కూల్ అని నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.