ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ తీయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ఒక్కసారి గ్రీజ్ లో పాతుకుపోయాడంటే భారీ స్కోర్ చేసేస్తాడు.ప్రస్తుతం బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న యాషెస్ టెస్టులో స్టీవ్ స్మిత్ కి ఫీల్డింగ్ ఏర్పాటు చేసిన విధానం ఆశ్చర్యానికి గురి చేసింది.
యాషెస్ 2023 లో భాగంగా నేడు రెండో రోజు ఆట జరుగుతుంది. వికెట్లేమీ నష్టపోకుండా ఓవర్ నైట్ స్కోర్ 14 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా..ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చింది. అయితే బ్రాడ్ 11 ఓవర్లో ఆసీస్ కి కోలుకొని షాకిచ్చాడు. మొదటి రెండు బంతులకి ఓపెనర్ వార్నర్ తో పాటు వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ లబుషేన్ ని పెవిలియన్ కి పంపించాడు. ఈ దశలో గ్రీజ్ లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా ఆడాడు. మరో ఎండ్ లో ఖవాజా కూడా పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆసీస్ స్కోర్ నత్త నడకన సాగింది. అయితే ప్రమాదకరంగా వీరి జోడీని లంచ్ కి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ విడదీసాడు. అయితే ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ కి ఫీల్డింగ్ ఏర్పాటు చేసిన విధానం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ తీయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ఒక్కసారి గ్రీజ్ లో పాతుకుపోయాడంటే భారీ స్కోర్ చేసేస్తాడు. వినూత్నమైన టెక్నీక్ తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారతాడు. పిచ్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా స్మిత్ ని అవుట్ చేయడం శక్తికి మించిన పని. ప్రస్తుతం బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న యాషెస్ టెస్టులో స్మిత్ ని అవుట్ చేయడం కోసం కెప్టెన్ బెన్ స్టోక్స్ సెట్ చేసిన ఫీల్డింగ్ విధానం ఒక టెయిలండర్ ని గుర్తుకు చేస్తుంది. స్మిత్ ఎన్ని రకాలుగా అవుట్ చేద్దామని ప్రయత్నించినా ఇంగ్లాండ్ కి ఫలితం రాలేదు.
దీంతో స్టోక్స్ మూడు స్లిప్ లతో పాటుగా.. ఒక గల్లీని కూడా ఏర్పాటు చేసాడు. అంతేకాదు వెనకాల లెగ్ స్లిప్ లో కూడా ఇద్దరు ఫీల్డర్లను ఉంచాడు. సాధారణంగా ఇలాంటి ఫీల్డ్ సెటప్ ని టెయిలండర్ కి మనం చూస్తాము. కానీ స్మిత్ కి ఇలాంటి ఫీల్డ్ సెట్ చేయడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఎట్టలకే స్టోక్స్ లంచ్ కి ముందు స్మిత్ ని ఔట్ చేసి ఇంగ్లాండ్ కి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా 3 వికెట్లకి 124 పరుగులు చేసింది. గ్రీజ్ లో హెడ్ (37) ఓపెనర్ ఖవాజా(55) ఉన్నారు. ఇంకా 267 పరుగులు వెనకపడి ఉన్న ఆసీస్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మొత్తానికి స్టోక్స్.. స్మిత్ కి సెట్ చేసిన ఫీల్డింగ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.