ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్ ఆఫ్ ది గ్రేట్ బ్యాటర్ అని అందరికీ తెలుసు. గ్రీజ్ లో పాతుకుపోయి భారీ ఇన్నింగ్స్ లు ఆడడంలో స్మిత్ దిట్ట. బ్యాటింగ్ తోనే కాదు కెప్టెన్సీ, ఫీల్డింగ్ లో కూడా అదరగొడతాడు. అయితే తాజాగా ఈ బ్యాటర్ లో మనకు తెలియని ఒక కొత్త అవతారంలో కనిపించి సర్ ప్రైజ్ చేసాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్టు క్రికెట్ ని శాసిస్తున్నాడు. తన బ్యాటింగ్ తో గత దశాబ్దకాలంగా ఆస్ట్రేలియా ఎన్నో మర్చిపోలేని విజయాలందించాడు. గ్రీజ్ లో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు స్మిత్ వికెట్ తీయడం పెద్ద తలనొప్పి. గ్రీజ్ లో పాతుకుపోయి భారీ ఇన్నింగ్స్ లు ఆడడంలో స్మిత్ దిట్ట. బ్యాటింగ్ తోనే కాదు కెప్టెన్సీ, ఫీల్డింగ్ లో కూడా అదరగొడతాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ క్యాచ్ స్మిత్ ఎలా అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మిత్ గురించి ఇవన్నీ మనకి తెలిసినవే. కానీ ఈ బ్యాటర్ లో మనకు తెలియని ఒక కొత్త అవతారంలో కనిపించి సర్ ప్రైజ్ చేసాడు. తెలుగు సినిమా డైలాగ్ లు చెబుతూ అలరించాడు.
ప్రస్తుతం స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్ లో లబు షేన్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదిలా ఉండగా.. స్మిత్ నోటా తెలుగు డైలాగ్స్ చెప్పి తెలుగు ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగుతో ముచ్చటించిన స్మిత్ ఎక్కువగా బాల కృష్ణ డైలాగ్స్ చెప్పడం విశేషం. “అపాయింట్ మెంట్ లేకుండా వస్తే వెకేషన్ చూడను.. లొకేషన్ చూడను..” “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐయామ్ నాట్ ది ట్రబుల్ ఐయామ్ ది ట్రూత్” అంటూ హీరో నందమూరి బాలకృష్ణ డైలాగులు చెప్పడం నవ్వులు తెప్పించాయి.
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన తగ్గేదెలా డైలాగ్ కూడా చెప్పిన ఆసీస్ మాజీ బ్యాటర్ లెజెండ్ సినిమాలో ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు అనే డైలాగ్ చెప్పడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో కాసేపు యాంకర్ నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను 123 పరుగులు చేసింది. గ్రీజ్ లో లబుషేన్, గ్రీన్ ఉన్నారు. ఇప్పటికే 296 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. మరో వంద పరుగులు అదనంగా జోడించిన టీమిండియా ఈ టార్గెట్ ఛేజ్ చేయడం చాలా కష్టం. మొత్తానికి స్మిత్ చెప్పిన తెలుగు డైలాగ్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
స్టీవ్ స్మిత్ నోట 🥳
మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎మరి తనదైన మనేరిజంతో 🔥
ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live
మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ— StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023