డబ్ల్యూటీసి ఫైనల్లో భారత్ తో పోల్చుకుంటే ఆస్ట్రేలియానే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. దీనికి కారణం ఇంగ్లాండ్ లోని పిచ్ లు వారికి అనుకూలంగా ఉండడమే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ మెగా ఫైనల్ పై ఆస్టేలియన్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ ఒక విషయంలో బయపడుతున్నాడు.
రెండు నెలలుగా అభిమానులని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సందడి ముగిసింది. ఈ విషయం ఇండియన్ క్రికెట్ లవర్స్ జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా..మళ్ళీ ఐపీఎల్ రావాలంటే వచ్చే సమ్మర్ వరకు ఆగాల్సిందే. అయితే ఐపీఎల్ అయిపోయినా ఆ లోటు తీర్చేందుకు ఈ ఏడాది చాలా మెగా టోర్నీలు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూటీసి ఫైనల్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేనందుకు రెడీ గా ఉంది. జూన్ 7 న ఈ ప్రతిష్టాత్మకమైన ఫైనల్ ఇంగ్లాండ్ లోని ఓవల్ లో జరగనుండగా.. ఆస్ట్రేలియాతో భారత్ ఈ మెగా ఫైనల్ ఆడనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ఫైనల్ పై ఆస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒక విషయంలో బయపడుతున్నాడు.
డబ్ల్యూటీసి ఫైనల్లో భారత్ తో పోల్చుకుంటే ఆస్ట్రేలియానే హాట్ ఫేవరేట్. ఇంగ్లాండ్ లోని స్వింగ్ పిచ్ ల మీద మంచి అవగాహన ..గత నెల రోజులుగా ఈ ఫైనల్ కోసం ప్రిపేర్ అవ్వడం.. అందరూ కూడా ఫామ్ లో ఉండడం.. ఆస్ట్రేలియాకి కలిసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మీద ఈ మ్యాచ్ గెలిచి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవడం పెద్ద సవాలే. ఇటీవలే ఐపీఎల్ ముగించుకున్న టీమిండియా ప్లేయర్లు.. ఇంగ్లాండ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టేసాడు. అయితే భారత్ పోల్చుకుంటే అన్ని విషయాల్లో మెరుగ్గా ఉన్నా.. స్టీవ్ స్మిత్ మాత్రం భారత్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లని చూసి భయపడుతున్నాడు.
స్మిత్ ఈ స్పిన్ ద్వయం గురించి మాట్లాడుతూ..”ఒవెల్ లో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశముంది. ఒకవేళ భారత్ లో ఉండే పిచ్ కండిషన్ లా ఉంటుందేమో అనే భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా జడేజా, అశ్విన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశముంది. వీరిని ఎలా ఎదుర్కోవాలో ఒక అంచనాకు వచ్చాము. డబ్ల్యూటీసీ మంచి ఆలోచన. ఎంత సామ్రాదాయకమైన క్రికెట్ ఐన పోటీ ఉంటేనే మజా వస్తుంది. మ్యాచ్ గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కంటే భారత అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా”. మరి ఓవల్ లో కండీషన్ లు భారత పిచ్ లను పోలి ఉంటే స్మిత్ అనుకున్నట్లు ఆస్టేలియాకి జడేజా, అశ్విన్ ని ఎదుర్కోవడం సవాలే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.