యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఇంగ్లీష్ జట్టు సెషన్, సెషన్‌కు మ్యాచ్‌పై తమ పట్టును బిగిస్తోంది. ఇంగ్లండ్ ఫ్యాన్స్ కూడా తమ టీమ్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ప్రధాన ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను వాళ్లు ఒక ఆటాడుకుంటున్నారు.
ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రేజ్ కలిగిన సిరీస్‌ల్లో యాషెస్ ఒకటి. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ టెస్ట్ సిరీస్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. టీ20 మ్యాచ్‌లో ఉండే హైటెన్షన్ వాతావరణం యాషెస్‌లో కనిపిస్తుంది. రెండు టీమ్‌ల ఆటగాళ్లు తమ సర్వశక్తులూ ఒడ్డి ఆడటంతో ఈ సిరీస్‌కు అంత ఆకర్షణ వచ్చింది. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 398 రన్స్‌కు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 386 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బజ్ బాల్ స్టైల్లో దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. రెండో ఇన్సింగ్స్‌లో మాత్రం తేలిపోయింది. ఇంగ్లీష్ టీమ్ 273 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో 281 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగింది ఆసీస్. ప్రస్తుతం ఆస్ట్రేలియా 107 రన్స్‌తో ఉంది. ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (36), మార్నస్ లబుషేన్ (13), స్టీవ్ స్మిత్ (6) లాంటి కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. ఉస్మానా ఖవాజా (34 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.
ఖవాజా పైనే కంగారూ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ టైమ్‌లో ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను ప్రేక్షకులు టీజ్ చేశారు. అప్పట్లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని కొన్నాళ్లు క్రికెట్‌కు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. ఆ కాంట్రవర్సీ టైమ్‌లో మీడియా ముందుకు వచ్చిన స్మిత్.. ఏడుస్తూ తన తప్పును ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ ఫ్యాన్స్ స్మిత్‌ను రెచ్చగొట్టేందుకు ఈ విషయాన్నే వాడుకున్నారు. ‘నువ్వు టీవీల్లో ఏడుస్తుంటే మేం చూశాం’ అంటూ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలోని ఇంగ్లండ్ జట్టు అభిమానులు స్మిత్‌ను ఎగతాళి చేశారు. అయితే స్టీవ్ మాత్రం నవ్వుతూ ఆటలో నిమగ్నం అయిపోయాడు. ఇంగ్లండ్ ఫ్యాన్స్ స్మిత్‌ను ఎగతాళి చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. తాను చేసిన తప్పును ఒప్పుకున్నప్పటికీ స్మిత్‌ను ఇలా ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
English crowd singing “We saw you crying on the Television” for Steve Smith. Smith dealing with all smiles.
English crowds are great but this is pathetic behaviour. For someone who has accepted their mistakes and apologized publically.#TheAshespic.twitter.com/jEFQqdIJSl
— Himanshu Pareek (@Sports_Himanshu) June 19, 2023
Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz
— cricket.com.au (@cricketcomau) March 29, 2018