పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత టీవీ షోలల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించిన విషయాల్లో మాట్లాడుతూ.. తనతో పాటు క్రికెట్ ఆడిన వారితో తన అనుబంధాలు, వివాదాలపై కూడా అక్తర్ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై కూడా అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ చెంప పగలగొట్టాలని ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సెహ్వాగ్, అక్తర్ మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా.. ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులుగా మెలిగారు. బయట ఈ ఇద్దరు ఎక్కడ కలిసినా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపేవారు. ఒకసారి సెహ్వాగ్ బట్టతలపై అక్తర్ కామెంట్ చేశాడు. మరో సందర్భంలో ఒకపార్టీ సందర్బంగా అక్తర్ సూట్, టై కట్టుకొని వెళ్లాడు. కాగా ఇది చూసిన సెహ్వాగ్.. అచ్చం వెయిటర్‌లా కనిపిస్తున్నావు అని కామెంట్ చేశాడు. ఇలాంటి సరదా సందర్బాలు చాలానే ఉన్నాయి.
తాజాగా అక్తర్ యూట్యూబ్ వేదికగా జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో పాల్గొన్నాడు. తన్మయ్ భట్, అక్తర్‌ల మధ్య సంభాషణ హైలెట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ”నాకు ఒక కోరిక మిగిలిపోయింది.. ఏదో ఒకరోజు నా ప్రియ మిత్రుడు సెహ్వాగ్ చెంపను గట్టిగానే చెళ్లుమనిపిస్తా” అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా దీనిపై సెహ్వాగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు. సెహ్వాగ్ స్పందిస్తాడో లేదో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రవిచంద్రన్ అశ్విన్ పరువు తీసేలా సెహ్వాగ్ కామెంట్స్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.