వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ రికార్డు నెలకొల్పింది.
తొలిసారి ప్రారంభం అయిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్.. పురుషుల ప్రీమియర్ లీగ్ కు ఏమాత్రం తీసిపోవడం లేదు. మహిళా క్రికెటర్లు కూడా పురుష బ్యాటర్ల లాగే సిక్స్ లు ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్ ల్లోనే భారీ స్కోర్లు నమోదు కావడంతో WPLపై భారీగా అంచనాలు నమోదు అయ్యాయి. ఆ అంచనాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు మహిళా క్రికెటర్లు. తాజాగా వుమెన్స్ డే రోజున ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్దశతకం బాది రికార్డు సృష్టించింది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ కు గుజరాత్ మహిళల జట్టు ప్రత్యర్థి బౌలర్లపై యుద్దాన్ని ప్రకటించింది. ముఖ్యంగా ఓపెనర్ సోఫియా ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఏ బౌలర్ ను వదలకుండా ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తిందించి. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో సోఫియా తన విశ్వరూపాన్నే చూపించింది. ప్రీతి బోస్ వేసిన ఈ ఓవర్ లో 4, 6, 4, 4, 4 బాదేసింది. ఈ క్రమంలోనే 18 బంతుల్లో తన అర్దశతకాన్ని నమోదు చేసుకుంది.
దాంతో WPLలో అత్యంత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది సోఫియా.ఈ క్రమంలోనే 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ లతో మంచి ఊపుమీదున్న సోఫియాను శ్రేయాంక పాటిల్ అవుట్ చేసింది. మిగతా వారిలో హర్లిన్ డియోల్ 67 పరుగులతో రాణించింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది గుజరాత్ జట్టు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ వుమెన్స్.. దాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ఓపెనర్లు స్మృతి మంధన(18) పరుగులు చేసి అవుటవ్వగా.. సోఫీ డెవిన్ 18 బంతుల్లో 31 పరుగులతో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రస్తుతం ఆర్సీబీ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కచ్చితంగా విజయం సాధించాలి. ఇప్పటికే రెండు వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Fifty in just 18 balls by Sophia Dunkley – the quickest of the WPL. pic.twitter.com/MJPMBuNbao
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 8, 2023