క్రికెట్ అంటే ఇష్టంలేని వాళ్లను సైతం తన వైపు తిప్పుకున్న క్రికెటర్ స్మృతి మంధాన. క్రికెట్ చూడని వాళ్లకి కూడా క్రష్‌గా మారిపోయింది ఈ మహిళా క్రికెటర్. ఆటతోనే కాదు, అందంతోనూ కుర్రాళ్ల మనసు దోచుకుంటుంది. అయితే ఆమెకు కూడా ఒకరిపై క్రష్ ఉందని చెప్పి కుర్రాకారు గుండెలను ముక్కలు చేసింది. చిన్ననాటి నుంచి తనకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్ అయి చెప్పింది.
సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించిన స్మృతి మంధాన… ఓ అభిమాని ‘మీ క్రష్ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘చిన్నప్పటి నుంచి నాకు హృత్రిక్ రోషన్ అంటే చాలా ఇష్టం… ఇప్పటికీ, ఎప్పటికీ అతనే’ అంటూ రిప్లై ఇచ్చింది స్మృతి మంధాన. ఈ సమాధానంతో ఆమె వీరాభిమానులు, హృతిక్ రోషన్‌లా ఫిజిక్ పెంచేందుకు జిమ్‌లో తెగ కుస్తీలు పడుతున్నారట.
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో మంధాన మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే ఒక అద్భుత సెంచరీ కూడా చేసింది. అలాగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, టీ20 ఉమెన్స్ లీగ్ వంటి వాటిల్లో పాల్గొంటున్న ఆమె… తన స్వగ్రామంలో ‘ఎస్ఎం 18’ అనే పేరుతో ఓ కేఫ్ నడిపిస్తోంది. ఇది కాకుండా ఎయిర్ ఆప్టిక్స్, బాటా, రెడ్ బుల్, హీరో మోటర్స్ వంటి టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది స్మృతి మంధాన. మరి స్మృతి మంధాన క్రష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The 123 of a special cricketer: Smriti Mandhana’s memorable World Cup day against West Indies
✍🏽 @vinayakkm
READ:https://t.co/uPXS1aksWj pic.twitter.com/t7zIoo09Wk
— The Field (@thefield_in) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.