కొన్నిసార్లు క్రికెట్ లో వింత వింత సంఘటనలు కనిపిస్తుంటాయి. ఆటగాళ్ల కంటే అంపైర్ల వల్లే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలాంటివి బయటకొచ్చినప్పుడు నెటిజన్స్ మైదానంలోని వాళ్లే కాదు.. చూస్తున్న నెటిజన్స్ కూడా అయోమయంలో పడిపోతారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే ఓ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో బ్యాటర్ స్మిత్ తోపాటు వికెట్ కీపర్ బట్లర్ అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. వన్డే సిరీస్ ఆడుతోంది. ప్రపంచకప్ గెలిచిన ఈ జట్టు.. అది జరిగిన కొన్ని రోజుల్లోనే ఆస్ట్రేలియా చేతిలో రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది. తాజాగా మెల్ బోర్న్ వేదికగా మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ ఓడిన ఆసీస్.. బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు హెడ్(152), వార్నర్ (106) సెంచరీలతో చెలరేగారు. ఇక ఫస్ట్ డౌన్ లో దిగిన స్మిత్.. 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఔటైన విషయం మాత్రం వైరల్ గా మారింది.
ఎందుకంటే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46వ ఓవర్ ఓలీ స్టోన్ బౌలింగ్ వేశాడు. క్రీజులో స్మిత్ ఉన్నాడు. మూడో బంతికి ఆఫ్ సైడ్ జరిగిన స్మిత్.. ఫైన్ లెగ్ లో షాట్ ఆడాలనుకున్నాడు. కానీ స్టోన్ తెలివిగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయడంతో స్మిత్ బంతిని మిస్ చేశాడు. కానీ ఆ బాల్.. స్మిత్ గ్లోవ్స్ కి టచ్ అవుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. వెంటనే బట్లర్ అప్పీలు చేసినప్పటికీ అంపైర్ సైలెంట్ గా ఉండిపోయాడు. దాంతో గట్టిగా అరిచిన బట్లర్.. రివ్యూ తీసుకున్నాడు. అప్పుడు బట్లర్ అరుపులు విన్న అంపైర్ పాల్ విల్సన్.. ఔటిచ్చేశాడు. స్మిత్ మాత్రం తనకు సంబంధం లేదన్నట్లు మొండిగా క్రీజులో ఉండిపోయాడు. అంపైర్ చేయి పైకెత్తిన తర్వాతే పెవిలియన్ కు చేరాడు. దీంతో నెటిజన్స్.. స్మిత్ తీరుపై మండిపడుతున్నారు. మొండి ఆట ఆడుతున్నాడు. ఇంకా మారలేదని కామెంట్స్ పెడుతున్నారు.
Total comedy of decision at MCG. pic.twitter.com/GSotlJX8cq
— Johns. (@CricCrazyJohns) November 22, 2022