సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి వేలాదిమంది ప్రజలు తమ నిరసనను తెలియజేస్తూ రోడ్డెక్కారు. రోజులు గడుస్తోన్నప్పటికీ.. సంక్షోభ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహానికి లోనై ఈ ఆందోళనకు దిగారు. భద్రత వలయాన్ని సైతం లెక్కచేయకుండా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు. ఇది జరిగిన కాసేపటికే.. నిరసనకారులు గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతన్నస్టేడియం వద్ద గుమికూడారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ నెలకొంది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆందోళన కారుల్లో ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది. తమ నిరసనను తెలియజేయడానికి రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పెద్దఎత్తున గుమికూడడంతో మొదట దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార భవనాన్ని ముట్టడించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఆందోళనకారులు గాలే వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతన్నస్టేడియం వద్ద వేళా సంఖ్యలో గుమికూడారు. తమ దేశ జాతీయ పతాకాలను చేతబట్టుకున్న లంకేయులు పెద్ద సంఖ్యలో గాలే స్టేడియం వద్దకు చేరుకున్నారు. గో హోమ్ గొటా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
Wonder what must be going through the Sri Lankan players’ heads as they try to go about their cricket unfazed even as the protests & songs for change continue to ring out right outside the Galle stadium #SLvAus #SriLankaProtests pic.twitter.com/FLK6Zaqj62
— Bharat Sundaresan (@beastieboy07) July 9, 2022
ఇది కూడా చదవండి: Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్‌తో తెగదెంపులు చేసుకున్న జడేజా!
అయితే.. ప్రస్తుతానికి నిరసనకారులు స్టేడియంలోనికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించకపోవడంతో మ్యాచ్ యధాతథంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య టెస్ట్ మ్యాచ్ ఐదురోజుల పాటు కొనసాగుతుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్ కొనసాగకపోవచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ఆరా తీస్తోంది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Powerful peoples come powerful places 💪🏻🔥#SriLankaProtests #GoHomeGota pic.twitter.com/pfZ46rkkhl
— 𝒦𝑒𝑒𝓇𝓉𝒽𝓎 𝒮𝓇𝒾 (@luxesri03) July 9, 2022
Sri Lankan protesters find some relief from the Colombo heat…in the pool in President Rajapaksa’s official residence. #SriLankaProtests #SriLankaCrisis pic.twitter.com/tNtClOFric
— World conflicts Monitoring Center (@WorldBreakingN9) July 9, 2022
ప్రస్తుతం శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్.. రెండో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 364 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్ ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 84, ఏంజెలో మత్యుస్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మార్నుస్ లాంబుషెన్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో మెరిశారు. లాంబుషెన్ 104 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#SLvsAUS 2nd Test
Day 2: Stumps – Sri Lanka trail by 180 runs
SL 184/2
Kusal Mendis -84(152) | Dimuth Karunaratne 86(165) | Mitchell Starc 1/28 pic.twitter.com/qZAdRFmZjd— 11CricketNews (@11cricketnews) July 9, 2022
ఇది కూడా చదవండి: Sara Tendulkar: ‘మీ నాన్న డబ్బు వేస్ట్ చేస్తున్నావ్’ నెటిజన్ కామెంట్.. కౌంటరిచ్చిన సచిన్ కూతురు!