గౌతమ బుద్దుని జీవిత చరిత్ర గురించి ఎంత మందికి తెలుసు. ఆయన అసలు పేరు సిద్దార్థుడు. ఆయనొక మహారాజు. ఒక రోజు బయటకు వెళ్లడంతో ఆయన జీవితమే మారిపోయింది. చివరకు మానవ జీవితంలో కష్టాలకు కారణం కోరికలు అని భావించి..
గౌతమ బుద్దుని జీవిత చరిత్ర గురించి ఎంత మందికి తెలుసు. ఆయన అసలు పేరు సిద్దార్థుడు. ఆయనొక మహారాజు. ఒక రోజు బయటకు వెళ్లడంతో ఆయన జీవితమే మారిపోయింది. చివరకు మానవ జీవితంలో కష్టాలకు కారణం కోరికలు అని భావించి.. వాటిని త్యజించాలని భావించి సన్యాసిగా మారిపోయాడు. కోట్లాది ఆస్తిని, కుటుంబాన్ని వదిలేసి.. బోధి చెట్టు కింద ధ్యానం చేసి జ్ఞానం సంపాదించాడు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారా అంటే అది అసాధ్యం. ఎందుకంటే ఒక్క రూపాయి కోసం పక్కవాడిని ఎలా మోసం చేయోలోనని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కోట్లాది రూపాయలు వదులుకుంటారా. అలా వదులుకుంటే ఖచ్చితంగా పిచ్చోడన్న ముద్ర వేసేస్తుంది ఈ సమాజం. కానీ ఓ వ్యక్తి తన యావదాస్తిని వదిలేసి.. సన్యాసినిగా మారిపోయి.. మరో గౌతమ బుద్దుడు అయ్యాడు.
వేల కోట్ల సంపాదనను కాదని ఓ వ్యక్తి సన్యాసిగా మారిపోయాడు. అతడు మరెవ్వరో కాదూ బిలియనీర్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజ పారిశ్రామిక వేతల్లో ఒకరు ఆనంద్ కృష్ణన్ కుమారుడు వెన్ అజన్ సిరిపన్యో. అందరిలా తన తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని అనుకోలేదు. భిన్నమైన జీవితాన్ని ఎంచుకుని సన్యాసిగా మారిపోయారు. శ్రీలంక తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ 5 బిలియన్ డాలర్ల అనగా 40 వేల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. కృష్ణన్ మలేషియాలో మూడవ అత్యంత సంపన్నుడు. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని. ఈ కంపెనీ 2006లో, మాక్సిస్ 74 శాతం వాటాను కొనుగోలు చేసి మన దేశంలో నడుస్తున్న ఎయిర్ సెల్ సైతం సొంతం చేసుకుంది. ఆ కంపెనీ దివాలా తీసిందనుకోండి. ఆయనకు మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారాలున్నాయి. వీరి కుటుంబం గౌతమ బుద్దుని పూజిస్తుంటారు. వివిధ ధార్మిక కార్యక్రమాలకు తన వంతు చేయూతనందించారు.
అయితే తండ్రి బాటలో వ్యాపార సామ్య్రాజాన్ని విస్తరించాల్సిన ఆయన కుమారుడు అజన్ సిరిపన్యో తన 18 ఏళ్ల వయస్సులో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. అయితే తొలుత ఆయన సన్యాసిగా మారిపోతున్నారంటూ అంతా పబ్లిక్ స్టంట్ అంటూ నవ్వుకున్నారు. అయితే చివరకు అతడు ఇదే మార్గాన్ని అనుసరించారు. సన్యాసిగా మారి భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతి కూడా. వెన్ అజన్ సిరిపన్యో.. తల్లి థాయ్ రాజకుటుంబానికి చెందిన వారని ప్రజలు నమ్ముతారు. అతను బ్రిటన్‌లో తన సోదరీమణులతో పెరిగాడని సమాచారం. ఆయనకు ఎనిమిదో భాషల్లో ప్రావీణ్యం ఉంది.