ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో అప్పటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ను ముంబైలోనే అవుట్ చేసి తాను పెద్ద తప్పు చేశానని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. 2008 ఐపీఎల్ సీజన్ల్ షోయబ్ అక్తర్ కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడిన విషయం తెలిసిందే. ‘ఆ సీజన్లో ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్‌రైడర్స్ మధ్య ముంబైలో మ్యాచ్ సందర్భంగా.. ముంబై ఓపెనర్‌గా వచ్చిన సచిన్‌ను నేను తొలి ఓవర్లోనే అవుట్ చేశాను.
కానీ.. సచిన్ ఆట చూసేందుకు నిండిపోయిన ముంబై స్టేడియం నాపై కన్నెర్రజేసింది. ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నాపై ప్రేక్షకులు పరుష పదజాలంతో రెచ్చిపోయారు. ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతున్న నన్ను.. కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాపాడాడు. ఫైన్‌లెగ్ నుంచి మిడ్‌వికెట్ వద్దకు పిలిపించి.. అసలు నిన్ను.. సచిన్‌ను ఎవరు అవుట్ చేయమన్నారు.. అది కూడా ముంబైలో వాళ్లు నిన్ను చంపేస్తారని గంగూలీ నాతో అన్నాడు.’ అని అక్తర్ ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
సచిన్ టెండూల్కర్‌ను ముంబైలోని వాంఖడే స్టేడియం హోం గ్రౌండ్. అలాంటి ప్లేస్‌లో సచిన్‌ను మొదటి ఓవర్లోనే అవుట్ చేయడంతో అక్తర్ సచిన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ కెప్టెన్ గంగూలీ 15 పరుగులతో ఆ టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ముంబైను అక్తర్ తొలి ఓవర్లో సచిన్‌ను అవుట్ చేసి దెబ్బతిసినా.. మరో ఓపెనర్ జయసూర్య, వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప.. 6 ఓవర్ల లోపలే టార్గెట్‌ను ఊదిపారేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇప్పటికీ, ఎప్పటికీ అతనే నా హీరో: రోహిత్ శర్మ
Shoaib Akhtar revealed that Sourav Ganguly had to change his fielding position amid the outburst from the spectators after he dismissed Sachin Tendulkar at the Wankhede Stadium in Mumbai#IPL https://t.co/I1KajXGaCH
— CricWick (@CricWick) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.