క్రికెట్ లో అజాత శత్రువు ఎవరంటే చాలా కొద్ది మంది పేర్లే వినిపిస్తాయి. వీరిలో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధమ వరుసలో నిలుస్తాడు. అయితే పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ మాత్రం సచిన్ పై సంచలన ఆరోపణలు చేసాడు.
క్రికెట్ లో అజాత శత్రువు ఎవరంటే చాలా కొద్ది మంది పేర్లే వినిపిస్తాయి. వీరిలో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధమ వరుసలో నిలుస్తాడు. రెండు దశాబ్దాల పైగా క్రికెట్ లో కొనసాగిన సచిన్.. ఏనాడు వివాదాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. ప్రత్యర్థి బౌలర్ కవ్విస్తే బ్యాట్ తోనే సమాధానం చెప్పేవాడు గాని ఎప్పుడు కూడా బౌలర్ పై మాట్లా యుద్ధానికి దిగలేదు. ఈ కారణంగానే ప్రపంచంలోనే ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు సచిన్. అంతే కాదు సచిన్ మీద ఆరోపణలు కూడా ఎవ్వరు చేయలేదు. అయితే పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ మాత్రం సచిన్ పై సంచలన ఆరోపణలు చేసాడు. ప్రస్తుతం ఈ మాజీ పాకిస్థాన్ స్పిన్నర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2011 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మొహాలీలో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించి గ్రాండ్ గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సెమీస్ లో సచిన్ 85 పరుగులతో రాణించి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓ వైపు వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. సచిన్ మాత్రం కీలక ఇన్నింగ్స్ తో జట్టుని ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచులో సచిన్ ముందుగానే ఔటయ్యేవాడని పాక్ స్పిన్నర్ అజ్మల్ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్‌లో సచిన్ అవుట్ అయినా కూడా అతన్ని కావాలనే నాటౌట్ ఇచ్చారని అజ్మల్ ఆరోపించాడు.
అజ్మల్ మాట్లాడుతూ.. “2011 వరల్డ్ కప్‌లో సచిన్ ఎల్బీడబ్ల్యూ ఘటన గుర్తుండే ఉంటుంది. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ వివాదాస్పదమవుతోంది. నా బౌలింగ్ లో సచిన్ ఔటయ్యాడు. ఈ విషయం అంపైర్ కి కూడా తెలుసు. అది ఖచ్చితంగా అవుటే. రిప్లేలో కన్వీనియెంట్‌గా రెండు ఫ్రేమ్స్ కట్ చేసి, బంతి వికెట్లను మిస్ అవుతోందని భ్రమింపచేశారు. లేదంటే ఆ బంతి కచ్చితంగా వికెట్ల వైపుగా వెళ్ళేది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ అవుట్ గురించి మాట్లాడిన ఇయాన్ గోల్ట్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ అవుట్ పై అంపైర్ గోల్ట్ స్పందిస్తూ.. “అవుట్‌కు సంబంధించిన నా రియాక్షన్ ఫొటోలను కొందరు పాముతూ ఉంటారు. అది చూస్తే నాకు నవ్వొస్తుంది. కానీ అప్పుడు నాకు నవ్వు రాలేదు. కానీ ఇప్పుడైనా సరే దాన్ని నేను అవుటనే అంటా. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు’ అని గోల్ట్ చెప్పాడు. మరీ చాలా రోజుల తర్వాత ఈ విషయం మరోసారి తెరపైకి రావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.