ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ రసవత్తరమే. అందులోనూ ఐసీసీ టోర్నీ అంటే.. పీక్స్ లో ఉంటుంది. క్రికెట్ చరిత్రలో ఈ క్రీడా సమరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇరుదేశాల మధ్య మ్యాచ్ అంటే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ.. అన్ని పనులను పక్కనబెట్టేసి టీవీలకు అతుక్కుపోతారు. మా వాళ్లే గెలవాలని దేవుడికి మొక్కుతారు. పూజలు చేస్తారు. సిక్స్ కొట్టారంటే సంబరాలు.. వికెట్ పడిందంటే ఆగ్రహావేశాలు. ఎక్కడ చూసినా ఇలాంటి సీన్లే కనిపిస్తాయి. ఇక మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు. ఆ ఆనందమే వేరు..! ఏకంగా టైటిల్ గెలిచేసినట్లుగా దేశవ్యాప్తంగా వేడుకుల జరుగుతాయి. డప్పుల మోతలు.. బాణాసంచా వెలుగులతో.. దీపావళి చేసుకుంటారు. దాయాధి దేశాల మధ్య ఇంత వైర్యం ఎందుకొచ్చిందో తెలియదు కానీ, ఇది ఇప్పట్లో ముగిసిపోదు అన్నది మాత్రం స్పష్టం.
మొహాలీ వేదికగా జరిగిన 2011 వరల్డ్ కప్ టోర్నీ సెమీస్ లో పాకిస్తాన్ పై భారత జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సచిన్, సెహ్వాగ్ రాణించడంతో.. నామమాత్రపు లక్ష్యాన్ని ప్రత్యర్తుల ముందు ఉంచినా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దాన్ని కాపాడుకోగలిగింది. ఇప్పుడు అక్తర్ భాదంతా.. ఈ మ్యాచ్ గురుంచే. ఈ మ్యాచ్ లో తాను ఆడి ఉంటే భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేదని.. ప్రపంచకప్ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నాడు.
Shoaib Akhtar “Management did injustice with me in the semifinal of WorldCup 2011. I was told I’m injured but I bowled 8 overs in warmup session. I would’ve caught Sehwag & Sachin because pressure would’ve been on India if I had played. I was heartbroken not to play SF of WC2011”
— Arfa Feroz Zake (@ArfaSays_) June 11, 2022
ఇది కూడా చదవండి: Shoaib Akhtar: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్
“మొహాలీ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్ లో నేను ఆడి ఉండాల్సింది. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఖచ్చితంగా టీమిండియాను ఓడిస్తాం.. అనుకున్నాం. కానీ, టీమ్ మేనేజ్మెంట్ ఫిట్ గా లేననే కారణంతో నన్ను పక్కనబెట్టింది. అదే ఓటమికి కారణమయ్యింది. ఒకవేళ నేను ఈ మ్యాచులో ఆడుంటే.. సచిన్, సెహ్వాగ్ ను ఆ పరుగులు కూడా చేయనిచ్చేవాడిని కాదు. ముందే ఔట్ చేసేవాడిని. దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. ఫలితంగా పాక్ పైనల్ ఫైనల్ కు వెళ్ళేది. కప్ సొంతమయ్యేది”.
Shoaib Akhtar on his YouTube –
Had I played the World Cup 2011 Semifinal, Indian Batting would have collapsed as I would have dismissed Sachin and Sehwag cheaply. But management told me you’re unfit, I was furious at missing the game and broke some things in the dressing room. pic.twitter.com/5h9cw1kCFf
— Abhijeet ♞ (@TheYorkerBall) June 11, 2022
“స్వల్ప లక్ష్యమే కదా.. ఈజీగా ఛేదిస్తాం అనుకున్నాం. కానీ, అలా జరగలేదు. యూనిస్ ఖాన్, అబ్దుల్ రజాక్.. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాణించివుంటే విజయం పాకిస్తాన్ సొంతమయ్యేది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతుంటే.. డగౌట్ లో కూర్చోని తట్టుకోలేకపోయా. చాలా నిరాశకు గురయ్యా. ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది” అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: మాంసం తింటాం, సింహాల్లా పరిగెడ్తాం! భారత్ బౌలర్లు మాత్రం..
అది 2011, మార్చి 30.. వరల్డ్ కప్ టోర్నీలో రెండో సెమీస్. వేదిక మొహాలీ. దాయాది దేశాల మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పటి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యారు. ధోని సారథ్యంలోని భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38).. పరుగులతో రాణించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43) లు.. రాణించినప్పటికీ విజయాన్ని అందించలేకపోయారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలు సమిష్టిగా రాణించి భారత్ కు విజయాన్ని అందించారు. మరి.. అక్తర్ కంటున్న పగటి కలలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Most High Voltage World Cup Match India Vs Pakistan#OnThisDay in 2011 Sachin Tendulkar Made 85 Runs in WC Semi Final Mohali.
6 WC ODIs Vs Pak#SachinTendulkar Played 5 Match
Sachin Won M.O.M 3 times💪
INDIA WON ALL🔥How Old Were You When India Beat Pakistan in 2011.?🤔 pic.twitter.com/zCNzdyKhdN
— Sachin Tendulkar🇮🇳 FC (@CrickeTendulkar) March 30, 2020