టీ20ల్లో రబాడ అద్భుతమైన బౌలర్. త్వరలో ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిపోతున్నారు. సరిగా ఇలాంటి టైంలో విండీస్ బ్యాటర్ అతడికి చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
టీ20లు అంటేనే చాలు చాలామంది బ్యాటర్లు సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోతుంటారు. స్టేడియం నలుమూలలా బౌండరీస్ కొడుతూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటారు. అయితే ఈ ఫార్మాట్ లోనూ కొందరు బౌలర్లు కొరకని కొయ్యల్లా తయారవుతూ ఉంటారు. అలాంటి వారిలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఒకడు. మీడియం పేస్ తో బౌలింగ్ చేసే ఇతడు.. డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తుంటాడు. త్వరలో ఐపీఎల్ కు సిద్ధమైన రబాడకు వెస్టిండీస్ బ్యాటర్ పెద్ద షాకిచ్చాడు. ఊరమాస్ రేంజ్ లో చితక్కొట్టాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రికెట్ ప్రేమికుల మధ్య డిస్కషన్ కు కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తాజాగా టీ20 సిరీస్ జరిగింది. మూడు మ్యాచుల ఈ సిరీస్ ని విండీస్ 2-1 తేడాతో గెలుచుకుంది. తాజాగా నిర్ణయాత్మక చివరి మ్యాచ్ జరగ్గా.. ఇందులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఛేదనలో సఫారీ జట్టు.. కేవలం 213/6 స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? బౌలర్ రబాడ. ప్రస్తుతం ఇదే డిస్కషన్ నడుస్తోంది.
ఎందుకంటే వెస్టిండీస్ బ్యాటర్లు ఓవైపు బాగానే బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. వికెట్లు మాత్రం వరసగా పడుతూ వచ్చాయి. దీంతో 200 లోపలే స్కోరు చేస్తుందనుకున్నారు. కానీ విండీస్ ఇన్నింగ్స్ లోని 20వ ఓవర్ లో షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. టీ20ల్లో స్టార్ బౌలర్ అయిన రబాడన బౌలింగ్ ని ఉతికారేశాడు. వరసగా 2,6,4,6,6,2 కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్ లోనే 26 పరుగులు వచ్చాయి. ఒకవేళ ఈ ఓవర్ లో రబాడ కట్టడి చేసి, తక్కువ పరుగులిచ్చి ఉంటే.. దక్షిణాఫ్రికా గెలిచి ఉండేదేమో? సరే ఇదంతా పక్కనబెడితే రబాడ బౌలింగ్ లో విండీస్ బ్యాటర్ చితక్కొట్టేయడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Romario Shepherd!
What a fightback by West Indies! Clean sensational hitting by Romario Shepherd takes Windies to 220/8(20 overs). Game on! pic.twitter.com/AjLHiOFXF6— Udit khar (@UditKhar) March 28, 2023