టీమిండియా మరో క్రికెటర్ పెళ్లి చేసేసుకున్నాడు. ఫ్రెండ్ తోనే ఏడడుగులు వేశాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది వసంత కాలం కాదు.. పెళ్లిళ్ల కాలం. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వరసగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తమ నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. రీసెంట్ గా ఓపెనర్ కేఎల్ రాహుల్ అతియా శెట్టిని పెళ్లాడగా, స్పిన్నర్ అక్షర్ పటేల్ చాలా సింపుల్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి టీమిండియా బౌలర్ శార్దుల్ ఠాకుర్ చేరాడు. ప్రస్తుతం తన పెళ్లి ఫొటోల్ని స్వయంగా శార్దుల్ ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. ఇవి చూడటానికి చాలా బాగున్నాయి. మరి అమ్మాయి ఎవరో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. శార్దుల్ ఠాకుర్, మిథాలీ పారుల్కర్ పెళ్లి తాజాగా ముంబయిలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శ్రేయస్ అయ్యర్, చాహల్ భార్య ధనశ్రీ తదితరులు హాజరయ్యారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న శార్దుల్-మిథాలీ కొన్ని వారాల వల్ల పెళ్లి ఇప్పుడు చేసుకున్నారు. తాజాగా మ్యారేజ్ జరిగినప్పటికీ.. కొన్ని రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెహందీ, హల్దీ ఫంక్షన్స్ తో ఇద్దరూ బిజీ బిజీగా ఉన్నారు. డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెళ్లి కంటే ముందే సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి తెగ సెర్చ్ చేశారు. ఏదైతేనేం స్టార్ క్రికెటర్ శార్దుల్ ఠాకుర్.. తన స్నేహితురాలు మిథాలీని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.
మిథాలీ పారుల్కర్ గురించి చెప్పుకుంటే.. బిజినెస్ ఉమన్ గా పేరు తెచ్చుకుంది. ‘ద బేక్స్’ సంస్థకు ఓనర్ గా ఉంది. ముంబయి, థానేలో ఈమెకు బ్రాంచీలు ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మిథాలీకి 5 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు శార్దుల్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి పాపులరిటీతోపాటు ఫాలోవర్స్ సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతుంది. మరోవైపు బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న శార్దుల్ ఠాకుర్.. అప్పుడప్పుడు బ్యాటుతోనూ మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. త్వరలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో ఇతడు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లోనూ శార్దుల్ కీలక సభ్యుడే. ఇప్పటివరకు భారత్ తరఫున 8 టెస్టులు, 34 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. మరి శార్దుల్-మిథాలీ జంటకు విషెస్ ను కింద కామెంట్స్ లో చెప్పండి.