ఐపీఎల్ 2023లో మరో సౌదీ సంస్థ అడుగుపెట్టనుంది. అన్‌అకాడమీ కంపెనీ స్థానంలో సౌదీ అరేబియా సంస్థ భాగస్వామిగా చేరేందుకు అంగీకరించింది. భారత్‌లో తమ మార్కెట్ విస్తరించేందుకు బీసీసీఐతో జతకట్టింది.
ఐపీఎల్ 2023 మరో కొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. క్రికెటర్లకు కాసులు కురిపిస్తూ.. వ్యాపార సంస్థలతో పాటు బీసీసీఐకి లాభాల పంట పండించే బంగారు బాతు ఐపీఎల్ 2023 సీజన్ కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ విషయం తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో సౌదీ అరేబియ్ దేశానికి చెందిన సంస్థ అధికారిక భాగస్వామిగా చేరనున్నట్లు సమాచారం. సౌదీ అరేబియా టూరిజం అథారిటీ సంస్థ ఐపీఎల్ 2023తో జట్టు కట్టనుంది. 2022 వరకు ఉన్న అన్‌అకాడమీ సంస్థ స్థానంలో సౌదీ టూరిజం సంస్థను తమ భాగస్వామిగా బీసీసీఐ ఆహ్వానించినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. ఐపీఎల్‌తో జట్టు కట్టిన రెండో సౌదీ దేశపు సంస్థగా సౌదీ టూరిజం అథారిటీ నిలుస్తుంది.
ఇప్పటికే సౌదీకి చెందిన అరమ్ కో సంస్థ ఐపీఎల్‌లో భాగస్వామిగా ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అలాగే.. అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను ఈ అరమ్ కో అనే సంస్థనే స్పాన్సర్ చేస్తోంది. ఐపీఎల్‌లో సిక్స్ పోయిన ప్రతిసారి అన్‌అకాడమీ క్రాకింగ్ సిక్స్ అని కామెంటర్లు చెప్పేవారు. అంతకు ముందు డీఎల్‌ఎఫ్ మ్యాక్సిమమ్ అనేవారు.. మరి ఇప్పుడు అన్‌అకాడమీ సంస్థ స్థానంలో సౌదీ అరేబియా టూరిజం అథారిటీ సంస్థ అధికారిక భాగస్వామి అయితే.. ఆ ప్రకటనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే.. సౌదీ అరేబియాలో టూరిజం అభివృద్ధి చేసేందుకు, భారత్ నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఐపీఎల్‌తో జట్టు కట్టనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా టాటా కంపెనీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అన్‌అకాడమీ స్థానంలో సౌదీ టూరిజం సంస్థ రానుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Today Saudi Arab tourism authority joined hands with @BCCI as sponsor in @IPL to strengthen cricket ties between the two countries. BCCI secretary @JayShah announced the partnership in presence of STA president along with me & @ShelarAshish pic.twitter.com/ay3FdakWWm
— Rajeev Shukla (@ShuklaRajiv) February 14, 2023