టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటివల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన చివరి టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సమాజం గురించి, క్రీడాల్లో ఆడపిల్లలు ప్రాతినిథ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆఖరి టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. టెన్నిస్ ప్రపంచంలో భారతదేశ జెండాను రెపరెపలాడించిన సానియా.. ఆటకు ఇటివల వీడ్కోలు పలికారు. అయితే చివరి సారిగా.. దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ 1000 సిరీస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఆటకు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సానియా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెన్నిస్‌కు దూరమైన తర్వాత.. ఆడటం, పోరాడటం, గెలవడం వల్ల వచ్చే అనుభూతిని మిస్ అవుతానని, ఆట కోసం తాను ఎలాంటి సామాజిక నిబంధనలను ఉల్లఘించలేదని స్పష్టం చేశారు.
అయినా ఆటపిల్లలను ఆటల్లో ప్రోత్సహించకపోవడం ఒక్క ముస్లిం సమాజంలో మాత్రమే లేదని, అందరూ అలాగే చేస్తున్నారని, బాక్సింగ్ చెయొద్దని మేరీ కోమ్‌ను కూడా అడ్డుకున్నారని ఆ విషయాన్ని మేరీనే పలు సందర్భాల్లో చెప్పినట్లు సానియా పేర్కొన్నారు. ఆడపిల్లలను క్రీడల్లో అడ్డుకుని ఉండకపోయి ఉంటే.. ఈ రోజు ఎంతో మంది ఆడపిల్లలు దేశం తరఫున అనేక క్రీడల్లో పాల్గొని ఉండేవారని అన్నారు. తన తల్లిదండ్రులు మాత్రం తనకు అడ్డుచెప్పలేదని, వారు ఎంతో ప్రోత్సహించే వారని అన్నారు. అప్పటి సమాచానికి తన పేరెంట్స్ ఎంతో అడ్వాన్స్‌గా ఉండేవారని, వారి సమాజం నుంచి ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారో తనకు తెలియదు కానీ, తనపై మాత్రం ఆ ప్రభావం పడనివ్వలేదని సానియా పేర్కొన్నారు.
అలాగే తమ చుట్టాలు మాత్రం తనను వెనక్కిలాగే ప్రయత్నం చేసినట్లు సానియా వెల్లడించారు. ఎండలో టెన్నిస్ ఆడి నల్లబడితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని అడిగేవాళ్లని గుర్తుచేసుకున్నారు. అయినా నేను నాకు నచ్చినట్లు బతుకుతున్నానని, అందరూ అలాగే స్వేచ్ఛగా బతకాలని సానియా అన్నారు. ఒక సమాజంగా మనం మరింత మెరుగుపడాలని తెలిపారు. ఏ పనినైనా కాస్త భిన్నంగా చేసినంత మాత్రనా వారిని దూషించడం, కించపర్చడం లేదా చెడ్డవారిగా పరిగణించడం చేయకూడదని హితవు పలికారు. మరి సానియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sania Mirza will play her final professional tournament as she partners with Madison Keys at the Dubai Open – Round 1 today! 🇮🇳🇺🇸#DubaiOpen #WTA #SaniaMirza #Tennis pic.twitter.com/jWsRxlWmVH
— Sportskeeda (@Sportskeeda) February 20, 2023