భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. దేశంలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియానే. టెన్నిస్ రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సానియా.. ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని సైతం ధీటుగా ఎదుర్కొంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సానియా సొంతం. క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. భారతీయులు బద్ధ శత్రువుగా భావించే పాకిస్తాన్ క్రికెటర్ ను పెళ్లాడింది. అయితే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తళుక్కుమనే సానియా.. లేటెస్ట్ గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
సానియా మీర్జా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తోంది. బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ స్టార్.. తాజాగా తన వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో సానియా.. ఇతరుల్లానే జిమ్‌లో నానా కష్టాలు పడుతోంది. పింక్ టాప్, జిమ్ ప్యాంట్‌తో కనిపించిన సానియా.. రోప్ వర్కౌట్స్‌తో పాటు సైక్లింగ్, బాల్, యాబ్స్, జంప్/బాక్స్ ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపిస్తోంది. బరువు తగ్గడంతో పాటు లోయర్ బాడీ మజిల్స్ బలంగా ఉంచుకోవడం కోసం సానియా ఈ ఎక్సర్‌సైజులు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తన పొట్టను చూపిస్తూ దీని కోసమే ఈ కష్టమంతా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘సునో కహో సునా’ అనే బాలీవుడ్ సాంగ్‌ను జత చేసి లిప్ సింక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Sonawane: ఇదేం బౌలింగ్ యాక్షన్ రా బాబు.. చూస్తేనే కళ్లు తిరుగుతున్నాయి!
సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. 2013లోనే సింగిల్స్ ఆడటం మానేసిన సానియా డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా అందుకుంది. దాదాపు 91 వారాలా పాటు నంబర్‌వన్ స్థానంలో కొనసాగింది. ఇక పాకిస్థానీ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా.. మరోవైపు తన టెన్నిస్ అకాడమీని పర్యవేక్షిస్తోంది.