వన్డే క్రికెట్లో సంచలనం నమోదయింది. పసికూన దేశమైన నేపాల్ ఆటగాడు ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ని దాటేశాడు.
క్రికెట్లో పసికూన దేశాలు అంటే క్రికెట్ ప్రేమికులతో పాటు, బాగా ఆడే దేశాలకు కాస్త చిన్న చూపు ఉంటుంది. వీరి మ్యాచులు చూడడమంటే చాలా బోరింగ్ అనేలా ఫీలవుతారు. ఎప్పుడో వరల్డ్ కప్ మ్యాచులకి ప్రేక్షకులని పలకరిస్తూ.. చిన్న దేశాలతో క్రికెట్ ఆడుకుంటూ కనిపిస్తాయి. ఒకరిద్దరు తప్పితే ఆసోసియేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరికీ గుర్తుండరు. వారిలో నేపాల్ కి చెందిన సందీప్ లెమెచ్చినా ఒకరు. అయితే ఇప్పుడు ఈ లెగ్ స్పిన్నర్ ప్రపంచ క్రికెట్ ని నెలకొల్పి సంచలనం సృష్టించాడు. ఆ రికార్డ్ ఏంటంటే ?
సందీప్ లెమెచ్చినా నేపాల్ కి చెందిన ప్రతిభకి కొదువ లేదు. రెగ్యులర్ గా క్రికెట్ ఫాలో అయ్యేవారికి ఈ లెగ్ స్పిన్నర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ తో పాటుగా ఇప్పటికే చాలా లీగ్ ల్లో కనిపించి తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఒమన్ తో మ్యాచ్ ఆడుతున్న సందీప్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వన్డేలో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ నేపాలీ లెగ్ స్పిన్నర్ కేవలం 42 మ్యాచులోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్(44) పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డ్ లెమెచ్చినా బద్దలు కొట్టాడు.ఈ లిస్టులో స్టార్క్ (52), సక్లైన్ ముస్తాక్ (53), షేన్ బాండ్ (54) ముస్తాఫిజార్(54) వరుస స్థానాల్లో నిలిచారు.
ఇక ఈ మ్యాచులో ఒమాన్ పై నేపాల్ ఘానా విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఖుషాల్ కన్నా(108) సెంచరీతో అదరగొట్టగా.. కామి(63) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ 226 పరుగులకే ఆలౌటైంది. నదీమ్, గౌడ్ రాణించిన మిగిలిన వారు విఫలమయ్యారు. లెమెచ్చినా 3 వికెట్లతో రాణించాడు. మొత్తానికి ఒక పసి కూన బౌలర్ వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.