ప్రముఖ క్రికెటర్ ఒకరు క్యాన్సర్ బారిన పడ్డాడు. తాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అతడు తెలిపాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రమాదకరమైందో తెలిసిందే. ఈ వ్యాధి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్ బారిన పడిన పలువురు సెలబ్రిటీలు తమ ప్రాణాలు కాపాడుకున్నారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, సినీ తారలు మమతా మోహన్‌దాస్, సంజయ్ దత్, సోనాలీ బింద్రేలు క్యాన్సర్‌ను జయించారు. ఈ వ్యాధితో పోరాడటం అంత సులువు కాదని.. కానీ ఏదైనా సాధ్యమేనని వీళ్లు నిరూపించారు. తినే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కచ్చితంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో సెలబ్రిటీ క్యాన్సర్ బారిన పడ్డారు.
ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ క్యాన్సర్ బారిన పడ్డాడు. చర్మ క్యాన్సర్‌తో తాను బాధపడుతున్నానని చెప్పిన బిల్లింగ్స్.. సూర్యరశ్మి ఎక్కువగా తాకడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి సహచరుల్లో అవగాహన కల్పించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. స్క్రీనింగ్ టెస్ట్‌లో క్యాన్సర్ అని తేలిందని.. దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నానని బిల్లింగ్స్ చెప్పుకొచ్చాడు. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పిందన్నాడు. ఛాతీలో క్యాన్సర్ కణితిని గుర్తించి ఆపరేషన్ చేసి వైద్యులు దాన్ని తొలగించారని బిల్లింగ్స్ పేర్కొన్నాడు. తాను క్రమంగా కోలుకుంటున్నానని అతడు వెల్లడించాడు. క్రికెటర్లు ఎండలో ఆడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బిల్లింగ్స్ సూచించాడు. ఇకపోతే, బిల్లింగ్స్ ఇంగ్లాండ్ జట్టు తరఫున 3 టెస్టులు, 28 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.
Great the @PCA have teamed up with @lifejacketskin !
Last October I had a bit of a reality check, two operations to remove skin cancer off my chest put cricket on the back burner for a little while and into perspective. pic.twitter.com/bV1mgsHlLj
— Sam Billings (@sambillings) May 9, 2023