Salim Durani With Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీది అగ్రెసివ్ నేచర్. అందుకే అతన్ని అంతా దాదా.. దాదా.. అంటారు. అలాంటి దాదాను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేస్తూ.. ముద్దు చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?
ఇండియన్ క్రికెట్‌లో సౌరవ్ గంగూలీని దాదా అని పిలుస్తారు. అతని అగ్రెసివ్ నేచర్‌కి, టీమిండియాలో అతను తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు నేపథ్యంలో గంగూలీని అంతా దాదా అని పిలుస్తుంటారు. అలాంటి క్రికెటర్‌ను సైతం ఓ వ్యక్తి బుగ్గలు పట్టి.. ముద్దు చేసేవాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా మాజీ లెజెండరీ క్రికెటర్ సలీం దురానీ. 88 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ ఆదివారం కన్నుమూశారు. 1934 డిసెంబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్‌లో పుట్టిన సలీం.. భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. గుజరాత్ స్టేట్ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. 1960లో భారత జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియాపై ఆయన తొలి మ్యాచ్ ఆడాడు. 1960 నుంచి 1973 వరుకు దాదాపు 13 ఏళ్ల సుదీర్ణ కెరీర్‌ను సలీం కొనసాగించారు.
టీమిండియా తరఫున మొత్తం 29 టెస్టులు ఆడిన సలీం.. 1202 పరుగులు చేశారు. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత.. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల డిమాండ్ మేరకు సిక్సులు కొట్టడం ఈయన ప్రత్యేకత. గ్రౌండ్‌లోని ఏ వైపు నుంచి సలీం సిక్స్ కొట్టాలని గట్టిగా కేకలు వినిపిస్తాయో.. ఆ వైపు సలీం సిక్స్ కొడతారని చెప్పుకుంటూ ఉంటారు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా.. ఎడం చేతి వాటం ఆర్థడాక్స్ బౌలర్‌గానూ సలీం మెరిశాడు. ఇంగ్లండ్‌తో 1961-62లో జరిగిన ఐదు టెస్టుల సిరీసును భారత జట్టు 2-0తో గెలవడంలో సలీందే కీలక పాత్ర. ఆ రెండు మ్యాచుల్లో ఒక మ్యాచులో ఎనిమిది, రెండో మ్యాచులో 10 వికెట్లతో సలీం రాణించారు.
భారీ సిక్సర్లు కొట్టే బ్యాటర్‌గా పేరొందిన సలీం దురానీ ఖాతాలో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. ఆయన కాలంలో ప్రపంచలోనే మేటి జట్టుగా ఉన్న వెస్టిండీస్‌ను పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్ ఓడించిదంటే.. అది సలీం కారణంగానే. క్రికెట్ తర్వాత సినిమాల్లోనూ సలీం తన మార్క్ చూపించారు. 1973లో చరిత్ర అనే సినిమాలో అప్పటి ప్రముఖ యాక్టర్ ప్రవీణ్ బాబితో కలిసి నటించారు. అయితే.. ఆయన మరణం భారత క్రికెట్‌కు తీరని లోటని ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్లతో సలీం దురానీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. మరి దాదాతో సలీం దురానీ ఉన్న ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RIPSalimDurani🥲🥲
Former India allrounder Salim Durani has died at the age of 88🥲🥲 pic.twitter.com/J13BwmXrBs— Pambi Praveen Kumar (@PraveenPKBRS) April 2, 2023