ఒలింపిక్స్ జరిగినా, కామన్ వెల్త్ జరిగినా, ఇంకోటి జరిగినా.. మన దేశానికొచ్చే పథకాల సంఖ్య మాత్రం రెండంఖ్యల్లోనే. 140 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఎందుకిలా జరుగుతుందా అంటే.. ఇన్నాళ్లు మన రాజకీయ నాయకులు క్రీడాకారులను ప్రోస్థహించరుగా అనుకునేవాళ్లం. కానీ, అది కొంతవరకే నిజం అనిపిస్తోంది. కొందరు మూర్ఖత్వపు అధికారులు/ అధికారిణులు.. క్రీడా కారులను బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇంటి పనులకు వాడుకుంటున్న సంఘటనలు అనేకం జరగగా, ఇప్పుడు ఏకంగా మసాజ్ లు చేయించుకున్న ఘటన బయటకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్‌లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్‌లో ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్‌కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్‌ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకునేది. అంతటితో ఆగిందా! లేదు. వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. రోజూ ఇదే పని. ఇంటికి తీసుకెళ్లడం.. ఇంటి పని చేపించుకోవడం.. ఆపై మసాజ్.. ఇక, మీ ట్రైనింగ్ అయిపోయింది వెళ్ళండి అనడం.
ఇలా చేస్తూ.. చేస్తూ.. ఈసారి దొరికిపోయింది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్‌లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకుంటుండగా, ఆమెతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ మహిళ అధికారిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు అందరూ. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్‌గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సాయ్.. ఇంతవరకు స్పందిచకపోవడం గమనార్హం. ఈ మహిళా అధికారిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080
— 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022