సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమ్ మొత్తం చాలా నిరాశలో మునిగిపోయి ఉంది. భారత జట్టులో చాలా టాలెంట్ ఉంది. కానీ.. అది ప్రపంచాన్ని ఓడించే ఒక జట్టుగా మార్చడమే కోచ్‌గా తన ప్రధాన కర్తవ్యంగా నేను భావించాను. అలాగే సచిన్‌తో మాట్లాడి..
టీమిండియా మాజీ కోచ్, 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గ్యారీ క్రిస్టన్ సంచలన విషయాలు వెల్లడించాడు. భారత జట్టు కోచ్‌గా తాను బాధ్యతలు చేపట్టేనాటికి టీమిండియా స్టార్ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సంతోషంగా లేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 కంటే ముందే భారత జట్టు కోచ్ గ్యారీ నియామకమైన విషయం తెలిసిందే. అంతకు ముందు 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన జట్టు.. 2007లో మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్ల చేతుల్లో ఓడిన భారత జట్టు.. అవమానకరంగా టోర్నీ నుంచి వైదొలగింది. అప్పటి నుంచి టీమిండియాలో భారీ ప్రక్షళాన మొదలైంది. అదే ఏడాది మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007 సౌతాఫ్రికా వేదికగా జరిగింది.
ఈ పొట్టి వరల్డ్ కప్‌కు యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని, తాము దూరంగా ఉంటామని త్రిమూర్తులు ‘సచిన్, గంగూలీ, ద్రవిడ్’ ప్రకటించారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు ధోని సారథ్యంలోని యువ జట్టు వెళ్లి విజయవంతంగా టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ధోని పూర్తి స్థాయిలో అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా మారిపోయాడు. అలాగే సౌతాఫ్రికాకు చెందిన గ్యారీ క్రిస్టన్ సైతం టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తాను చూసిన, అనిపించిందిన విషయాల గురించి గ్యారీ మాట్లాడుతూ..‘కోచ్‌గా వచ్చిన కొత్తలో సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమ్ మొత్తం చాలా నిరాశలో మునిగిపోయి ఉంది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి రౌండ్‌లోనే లంక, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి టోర్నీ నిష్క్రమించడంతో భారత క్రికెట్ అభిమానుల్లో కాక.. జట్టులో కూడా తీవ్ర నిరాశ అలుముకుంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ చాలా బాధలో కనిపించాడు.
అదే టైమ్‌లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నాడు. పైగా ఆ టైమ్‌లో సచిన్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడు. కానీ.. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడగలననే విషయం అతనికి తెలుసు అయినా.. జట్టుగా తమ ప్రదర్శన బాగలేకపోవడంతో సచిన్ ఆట నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాడు. కానీ.. భారత జట్టులో చాలా టాలెంట్ ఉంది. కానీ.. అది ప్రపంచాన్ని ఓడించే ఒక జట్టుగా మార్చడమే కోచ్‌గా తన ప్రధాన కర్తవ్యంగా నేను భావించాను. అలాగే సచిన్‌తో మాట్లాడి.. జట్టుకు అతని అవసరం ఎంతుందో వివరించే ప్రయత్నం చేశాను. అలాగే సచిన్ రిటైర్మెంట్ ఆలోచన మానుకోని తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాడు. ఆ తర్వాత జరిగిన విషయం తెలిసిందే. 2011లో భారత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. సచిన్ కూడా ఆ వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు’ అని గ్యారీ క్రిస్టన్ పేర్కొన్నాడు. మరి గ్యారీ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar was ‘deeply unhappy’ when I joined as India coach: Gary Kirsten
📰 Kirsten took over as India head coach in 2008 and led them to the World Cup title in 2011.
🔗https://t.co/2NGHYSCo7j#SachinTendulkar | #GaryKirsten | #TeamIndia pic.twitter.com/lSQ5xan61f
— Cricket.com (@weRcricket) February 14, 2023