ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే టన్నుల కొద్ది పరుగులు, వంద సెంచరీలు, ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు. కానీ బౌలింగ్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్లుగా కొనసాగిన సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్, మాజీ దిగ్గజ బౌలర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే కూడా సచిన్ ఒక విషయంలో ముందున్నాడు.
క్రికెట్‌లో బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా ప్రఖ్యాతి గాంచిన సచిన్.. బౌలింగ్‌లో ఈ దిగ్గజల కంటే ఎలా ముందు ఉంటాడని భావిస్తున్నారా.. ? ఇది నిజం. సుదీర్ఘమైన కెరీర్ ఉన్న సచిన్ టెండూల్కర్ దాదాపు రెండు దశాబ్దాలపైనే టీమిండియాకు తన సేవలు అందించాడు. అలాగే బ్యాట్‌తో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. అలాగే వన్డే క్రికెట్‌లో కెరీర్ మొత్తం మీదా 8054 బంతులను వేశాడు. అంటే దాదాపు 1352 ఓవర్ల పైనే సచిన్ బౌలింగ్ చేశాడు. మొత్తం ఈ నంబర్ అక్తర్, స్టెయిన్, ఇమ్రాన్ ఖాన్ కంటే కూడా ఎక్కువ. వన్డేల్లో వాళ్లు సచిన్ కంటే తక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు. వికెట్ల విషయంలో వాళ్లు ముందు వరుసలో ఉన్నా.. ఎక్కువ బంతులను వేసిన జాబితాలో మాత్రం సచిన్ వీరికంటే ముందు ఉండడం విశేషం.
సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌తో పాటు.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా జట్టుకు సేవలు అందించేవాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో కొన్ని సార్లు ఒక రెగ్యూలర్ స్పిన్నర్ పాత్రను కూడా సచిన్ పోషించాడు. అందుకే.. బౌలింగ్‌లో సచిన్ ఈ రికార్డును కలిగిఉన్నాడు. 1989లో వన్డే కెరీర్ మొదలుపెట్టిన సచిన్ 2012లో వీడ్కోలు పలికాడు. మొత్తం 463 వన్డేలు ఆడిన సచిన్.. 1352.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 6850 పరుగులు ఇచ్చి 154 వికెట్లు కూడా పడగొట్టాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాక పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్
— Sayyad Nag Pasha (@PashaNag) March 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.