క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ 25 ఏళ్ల ముద్దుగుమ్మ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలావుంటే.. నిన్నమొన్నటివరకూ సచిన్ తనయగానే అందరికీ పరిచయం అయిన సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుగాంచిన సారా, తాజాగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరాది పురస్కరించుకుని ఓ విభిన్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ ముచ్చటేంటో మీరే చూడండి..
లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. ప్రస్తుతం యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో మాస్టర్స్ చదువుతోంది. అయినప్పటికీ.. ఈ స్టార్ కిడ్ ఎప్పటికప్పుడు తనకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం సారా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఇదే తడువుగా సారా తన బిజినెస్ ఆలోచన గురుంచి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘కస్టమైజ్డ్ డైరీ ప్లానర్’ పేరిట కొత్త ఏడాది అంటే.. 2023 కోసం ఓ ప్రత్యేకమైన డైరీని రూపొందించింది.. సారా. ఈ డైరీలో తాము రోజు చేయాలనుకునే పనులను ఎంటర్ చేయడంతో పాటూ వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే విధంగానూ ప్రోత్సహిస్తోంది. డైరీలో ఫీచర్లు బాగానే ఉన్నప్పటికీ దాని ధర తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
సాధారణంగా కొత్త సంవత్సరం డైరీలు మార్కెట్ లో రూ.200 నుంచి రూ.250 రూపాయిల వరకు దొరుకుతాయి. కానీ, సారా టెండూల్కర్ కస్టమైజ్డ్ డైరీ రూ. 2,500 ఉంది. ఈ ధర తెలిశాక నెటిజన్లు.. ఇంత తక్కువా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ డైరీ కేవలం సంపన్నులకు మాత్రమేనంటూ కొందరు వాపోతుంటే, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మరో డైరీ తీసుకురావాలని మరికొందరు సూచిస్తున్నారు. సారా కస్టమైజ్డ్ డైరీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.