క్రీడా ప్రపంచంలో గెలుపోటములు సహజమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే రోజుల్లో వాటిని విజయాలుగా మార్చుకోవడమే నిజమైన విజేతల గొప్ప లక్షణం. అయితే అప్పుడప్పుడు కొన్ని పరాజయాలు పలకరించడం సహజం. ఈక్రమంలో కొన్ని విమర్శలను సైతం ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి విమర్శలే భారత మహిళల క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్రికెట్ లో భారత మహిళ జట్టు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఓ మాజీ దిగ్గజ క్రికెటర్ చేసిన విమర్శలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కామన్వెల్త్ క్రీడల్లో మెుదటి సారి ప్రవేశ పెట్టిన మహిళా క్రికెట్ లో భారత జట్టు అదరగొట్టింది. ఈక్రమంలోనే ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ సారి భారత్ కు గోల్డ్ మెడల్ ఖాయం అని అందరు అనుకున్నారు. అందుకు తగ్గట్టే అమ్మాయిలు కూడా ఆటలో అదరగొట్టారు. కానీ ఫైనల్స్ లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగులతో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నారు. గొప్పగా పోరాడినప్పటికీ భారత్ కు పరాజయం తప్పలేదు. దీంతో మహిళల జట్టుపై మజీ దిగ్గజ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ట్వీటర్ లో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
ఈ ఓటమిపై మహమ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ.. ”ఈ రోజు భారత మహిళా క్రికెట్ టీం ప్రదర్శించిన ఆట ఓ చెత్త ఆట. మ్యాచ్ ను చేజేతులా ప్రత్యర్థికి అప్పగించారు. క్రికెట్ గురించి తెలియని వారు ఆడినట్టు ఈ రోజు వారు ఆడారు. ఇది భారత్ గెలిచే మ్యాచ్. ఇంత గొప్ప అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేక పోయారు. నిజంగా వారిది చెత్త ఆట” అంటూ ట్వీటర్ ద్వారా విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ భారత మహిళలు తొలి కామన్వెల్త్ క్రిడల్లోనే క్రికెట్ లో ఫైనల్ వరకు వెళ్ళడం ఓ గొప్ప రికార్డ్ అనే చెప్పాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మెుదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఇక 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఎంతో గొప్పగా పోరాడిన ఇండియా టీమ్ పై అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి అజారుద్దీన్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rubbish batting by the Indian team. No common sense. Gave away a winning game on a platter. #INDvsAUS #WomensCricket #CWG22
— Mohammed Azharuddin (@azharflicks) August 7, 2022
ఇదీ చదవండి: Yastika Bhatia: వీడియో: బ్యాటింగ్‌కు వస్తూ.. బొక్కబోర్లా పడ్డా టీమిండియా బ్యాటర్!
ఇదీ చదవండి: Team India: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించిన భారత స్పిన్నర్లు