టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను దారుణంగా అవమానించాడు. మొన్నటి వరకు ఫామ్‌లో లేడని రాహుల్‌ను విమర్శించిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు.. పాపం రాహుల్ అంటున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023ని టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సోమవారం చివరి టెస్టు డ్రాగా ముగియడంతో.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్.. సిరీస్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ట్రోఫీని అందుకుని అశ్విన్ చేతుల్లో పెట్టాడు. అయితే ట్రోఫీని ఆటగాళ్లకు ఇచ్చే క్రమంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను చాలా దారుణంగా అవమానించాడు. రోహిత్ శర్మ ట్రోఫీతో తనవైపు వస్తుంటే.. తనకు ఇచ్చేందుకు వస్తుండని భావించిన రాహుల్, ట్రోఫీని అందుకోబోయాడు. రాహుల్‌ను సీరియస్‌గా చూసిన రోహిత్.. ట్రోఫీని రాహుల్‌కు ఇవ్వకుండా అశ్విన్ చేతుల్లో పెట్టాడు. దీంతో.. పాపం రాహుల్ అవమానంగా ఫీలై.. చిన్నబుచ్చుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
కాగా.. ఫామ్‌లో లేని కారణంగా కేఎల్ రాహుల్‌పై నిన్నటి వరకు క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ట్రోఫీ అందుకునే సమయంలో రాహుల్‌కు జరిగిన అవమానం తర్వాత రాహుల్‌పై జాలి చూపిస్తున్నారు. రోహిత్ శర్మను కేఎల్ రాహుల్ ఒక పెద్దన్నలా భావిస్తాడని, అలాంటి వ్యక్తే రాహుల్‌ను దారుణంగా అవమానించాడంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. సహజంగానే చాలా ముభావంగా ఉండే రాహుల్, నిన్నటి ఘటనతో మరింత డల్ అయిపోయడని నెటిజన్లు సైతం పేర్కొంటున్నారు. కేఎల్ రాహుల్‌కు జరిగిన ఈ అన్యాయం సరికాదని అంటున్నారు. రెండో టెస్టు వరకు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఇలా అవమానిస్తారా? అంటూ మండిపడుతున్నారు.
తొలి రెండు టెస్టుల్లో ఆడిన కేఎల్ రాహుల్ తన స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్‌ను జట్టు నుంచి తీసేసి అతని స్థానంలో శుమ్‌మన్ గిల్‌ను తీసుకోవాలనే డిమాండ్ చాలా గట్టిగానే వినిపించింది. ఆ క్రమంలో రెండు టెస్టు తర్వాత రాహుల్‌ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు మూడు, నాలుగు టెస్టుల్లో పక్కనపెట్టారు. సరే ఫామ్‌లో లేడు కదా పక్కనపెట్టినా ఎవరూ బాధపడలేదు. కానీ.. చివరికి ట్రోఫీ అందుకునే విషయంలో రాహుల్‌ను అవమానించడంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఆటగాడు గడ్డు పరిస్థితి ఎదుర్కొవడం సాధారణ విషయమే అని, అదే విరాట్ కోహ్లీ అలా ట్రోఫీ అందుకుంటుంటే ఇవ్వకుండా ఉంటారా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 13, 2023