టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అతని అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే.. బయోపిక్‌పై క్రేజ అప్డేట్ తెలిసింది.
కొన్ని కోట్ల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్.. గంగూలీ బయోపిక్. ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి పేరుంది. అలాంటి ఆటగాడి జీవితంపై సినిమా తీస్తే.. కచ్చితంగా సంచలన విజయం సాధించాడు. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో చొక్కా విప్పి గాల్లో తిప్పి సంఘటనను మరోసారి బిగ్‌స్ర్కీన్‌పైనే సినిమాటిక్ థీమ్‌లో చూసే అవకాశం వస్తే.. ఏ క్రికెట్ అభిమాని కూడా ఆ ఛాన్స్‌ను వదులుకోడు. అందుకే దాదా బయోపిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లపై బయోపిక్‌లు వచ్చాయి. దీంతో దాదా బయోపిక్‌ను కూడా వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకోరావాలని క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గంగూలీ బయోపిక్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. గంగూలీ బయోపిక్‌లో దాదా రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి గంగూలీ కూడా ఓకే చెప్పినట్లు, అలాగే స్క్రీప్ట్‌కు కూడా నో అబ్జెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో గంగూలీ బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నట్లు చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. ఫైనల్‌గా రణ్‌బీర్ కపూర్‌కు ఆ ఛాన్స్ దక్కినట్లు సమాచారం. రణ్‌బీర్ సైతం ఈ బయోపిక్‌లో నటించేందుకు ఎంతో ఉత్సహంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సైతం ప్రారంభం కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కాగా.. గంగూలీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం, ప్రేమ, టీమిండియాలోకి ఎంట్రీ, ఆస్ట్రేలియాతో గొడవ, కెప్టెన్ కావడం, సచిన్, ద్రవిడ్‌తో ఫ్రెండ్షిప్, యువ క్రికెటర్లు యువీ, సెహ్వాగ్, జహీర్ ఖాన్, కైఫ్, ధోనిలకు సపోర్ట్ చేయడం, లార్డ్స్‌లో జెర్సీ విప్పి గాల్లో తిప్పడం, స్టీవాను టాస్ కోసం వేచిఉండేలా చేయడం, కోచ్ చాపెల్‌తో గొడవ, కెప్టెన్సీ కోల్పోవడం, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోవడం, పట్టువదలకుండా తిరిగి టీమిండియాలోకి రావడం, బీసీసీఐ అధ్యక్షుడి కావాడం ఇలా ఆసక్తిగొలిపే సంఘటనలు చాలానే ఉన్నాయి. వీటిని కరెక్ట్‌గా తెరకెక్కించగలిగితే.. ‘దాదా’ బయోపిక్‌ను మించిన బయోపిక్ మరొకటి ఉండదేమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దాదాలా రణ్‌బీర్ కపూర్ ఎంత వరకు మెప్పించగలడని మీరు భావిస్తున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bollywood actor Ranbir Kapoor is all set to play the role of former Indian cricket men’s team captain Sourav Ganguly in his biopic.#RanbirKapoor #SouravGanguly #Cricket #Biography pic.twitter.com/7nYqGJ0J4d
— Boldsky (@Boldsky) February 22, 2023