ఇండియన్ క్రికెట్‌లో మిస్టర్ 360 ప్లేయర్ ఎవరంటే? కాస్తో కూస్తో క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. 30 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చినప్పటికీ.. తన విధ్వంసకరమైన ఆటతో మిస్టర్ 360గా ఫేమ్ తెచ్చుకున్నాడు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను క్రికెట్ లోకం మిస్టర్ 360 క్రికెటర్ అంటూ పొగిడేది. ఇప్పుడు అది కాస్త సూర్యకుమార్ యాదవ్ పేరు ముందు చేరింది. అయితే.. సూర్య టీమ్‌లో యాక్టివ్‌గా ఉండగానే మరో ప్లేయర్ సూర్యకు పోటీగా మారుతున్నాడు. ఇకపై భారత జట్టులో మిస్టర్ 360 ప్లేయర్ అంటే ఒక్క సూర్యనే కాదు.. మరో ఆటగాడు కూడా గుర్తుకు వస్తాడు.. అతనే రాహుల్ త్రిపాఠి.
ఇక విషయానికొస్తే.. క్రికెట్ అంటే ఒకప్పుడు సంప్రదాయంగా ఆడేవారు. టీ20 కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఆటలో వేగం పెరిగింది. షాట్లలో క్రియేటివిటి బయటకొచ్చింది. అలా స్వీప్ షాట్, అప్పర్ కట్ లాంటి వినూత్న షాట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇక బ్యాటింగ్ లో దిగడమే అన్ని రకాల షాట్స్ ఆడుతూ గుర్తింపు తెచ్చుకుంటున్న సుర్యకుమార్ యాదవ్.. మిస్టర్ 360 అని అందరితో పిలిపించుకుంటున్నాడు. ఇప్పుడు అతడికి రాహుల్ త్రిపాఠి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో సూర్యని మరిపించేలా బ్యాటింగ్ చేయడం విశేషం. ఆ వీడియోలు, ఆ షాట్స్ వైరల్ కావడంతో అభిమానులు అందరూ కూడా మరో మిస్టర్ 360 అని తెగ మాట్లాడుకుంటున్నారు.
రాహుల్ త్రిపాఠినే తీసుకుంటే, సూర్యకుమార్ లానే 30 ఏళ్లు దాటిన తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో ఈ మధ్య జరిగిన టీ20లో ఆకట్టుకున్న మనోడు.. తాజాగా న్యూజిలాండ్ జట్టుపై రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లో 44 పరుగులు చేసి వావ్ అనిపించాడు. పేస్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ సైడ్ స్కూప్ షాట్ తో కొట్టిన సిక్స్.. పాయింట్ లో కట్ షాట్ తో బౌండరీ అదిరిపోయాయి. ఇక శాంట్నర్ బౌలింగ్ లో ముందుకొచ్చి కొట్టిన స్ట్రెయిట్ సిక్స్ అయితే మ్యాచ్ కే హైలెట్. న్యూజిలాండ్ జట్టుని వణికించేసిన మనోడు.. దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయిపోయాడు గానీ లేదంటే కచ్చితంగా గిల్ కంటే ముందే సెంచరీ చేసేవాడు. ఏదైతేనేం భారత జట్టుకు మరో 360 డిగ్రీల ప్లేయర్ దొరకడం శుభపరిణామే. మరి రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
148 kmph by Ferguson and Rahul Tripathi played a crazy shot. pic.twitter.com/o1dNVkDwAz
— Johns. (@CricCrazyJohns) February 1, 2023
Well Played, Rahul Tripathi 👏#INDvNZ #RahulTripathi #IndianCricket pic.twitter.com/uEwQoBkuQc
— CRICKETNMORE (@cricketnmore) February 1, 2023