36 ఏళ్ళ వయసులో కూడా అత్యున్నత ప్రదర్శన చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రస్తావన ఎప్పుడు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు.
భారత క్రికెట్లో ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్ల లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఖచ్చితంగా ఉంటాడు. కుంబ్లే, హర్భజన్ తర్వాత భారత క్రికెట్ లో వారి లోటుని పూడుస్తూ తనదైన ముద్ర వేసాడు. కెరీర్ ఆరంభంలో ఎంత ఫామ్ లో ఉన్నాడో ఇప్పటికీ అదే ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. తన అత్యుత్తమ బౌలింగ్ తో 500 వికెట్లకి చేరువలో ఉన్నాడు ఈ ఆఫ్ స్పిన్నర్. పిచ్ ఎలాంటిదైనా ప్రభావం చూపించగల అతి కొద్ది మంది బౌలర్లలో అశ్విన్ ఒకడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ కి తుది జట్టులో స్థానం దక్కలేని సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు.
అశ్విన్ కి ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఈ ఏజ్ లో కూడా అశ్విన్ 5 వికెట్లు టెస్టుల్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తన్నాడు. ఇటీవలే జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఈ మిస్టరీ స్పిన్నర్ ఆసీస్ ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో భారత్ తరపున చాలా రికార్డులు క్రియేట్ చేసాడు. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రస్తావన ఎప్పుడు రాలేదు. పరిమిత వర్ల క్రికెట్ కి దూరంగా ఉంటున్న అశ్విన్.. టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే అశ్విన్ తాజాగా తాను ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత క్రికెట్ కి వీడ్కోలు చెప్పాలనుకున్నా అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
అశ్విన్ చాలా కాలం నుంచి మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీని వల్ల అతని కెరీర్ కూడా చాలా దెబ్బతింది. “బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో నా మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టింది. మోకాలు బాగా బాగా వాచిపోయింది. దీంతో నేను ఎంతో సక్సెస్ ఇచ్చిన బౌలింగ్ యాక్షన్ను వదిలేయాలని నిర్ణయించుకోవాలనుకున్నాను. బాంగ్లాదేశ్ సిరీస్ నుంచి తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు ఈ నా రిటైర్మెంట్ విషయం గురించి నా భార్యతో మాట్లాడాను. ఆస్ట్రేలియా సిరీస్ నాకు చివరిదయ్యే అవకాశం ఉందని చెప్పేశాను” అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి అశ్విన్ ఇలా తన బాధను బయటకు చెప్పుకొని ఎమోషనల్ అవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.