మరో రెండు వారాల్లో ఐపీఎల్ మెగా వేలంమొదలుకానుంది. ఫిబ్రవరి 12, 13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంఛైజీలు ఆటగాళ్ల ఎంపికపై కసరధ్హులు మొదలుపెట్టాయి. ఎవరిని తీసుకోవాలి.. ఎంతవరకు పెట్టొచ్చు అంటూ లెక్కలేసుకుంటున్నాయి. ఇటు అభిమానులు కూడా. ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేస్తుంది, ఎంతకు కొనుగోలు చేస్తుందనే లెక్కలు కడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. గతేడాది సన్‌రైజర్స్ తీవ్రంగా నిరాశ పరచడంతో ఈ సారైనా జట్టు సత్తా చాటాలని కోరుకుంటున్నారు. సన్‌రైజర్స్ యాజమాన్యం ఈసారైనా వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి : క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు
గతేడాది ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచి ఓపెనింగ్ బ్యాటర్‌తోపాటు వికెట్ కీపర్ అయినా డికాక్‌ను ఈ సారి మెగా వేలంలో కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయించుకుందట. వేలంలో ఎంత డబ్బైనా పెట్టి డికాక్ ని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఓపెనింగ్ బ్యాటర్ గా మంచి శుభారంభాన్ని అందించే డికాక్ కీపింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాదారణంగా మంచి వికెట్ కీపింగ్ నైపుణ్యం ఉండి, బ్యాటింగ్‌లోనూ సత్తా చాటే ఆటగాళ్లు తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో డికాక్ ఒకడు. గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ లోటు కనిపించింది. దీంతో ఈ సారి ఆ లోటును డికాక్‌తో పూడ్చేయాలని రైజర్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు డికాక్ మ్యాచ్ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సమర్థుడు. దీంతో ఓపెనింగ్‌లో డేవిడ్ వార్నర్ లోటును డికాక్‌తో సరిచేయాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో డికాక్ తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న విషయం తేలిందే. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.