భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. తొలి టెస్టులో డి కాక్ రెండు ఇన్నింగ్స్ 55 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కొనసాగుతానని డికాక్ పేర్కొన్నాడు.
2014లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన డి కాక్, ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే, జట్టు పేలవమైన ప్రదర్శనతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్ సౌతాఫ్రికా తన ప్రకటనలో, “వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో టెస్ట్ క్రికెట్‌కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించాడు” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణాఫ్రికా తరఫున డికాక్ మొత్తం 54 టెస్టులు ఆడి, 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్‌కు మాత్రమే సాధ్యమైంది