ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. పెర్త్‌లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో.. సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎన్గిడి చెలరేగిపోయాడు. అతని ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం అయ్యారు.
ఇక 134 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాను తొలి 10 ఓవర్ల వరకు టీమిండియా బౌలర్లు వణికించారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ తన తొలి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్, రోలి రోసోవ్‌లను అవుట్ చేసి ప్రొటీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. కానీ.. మార్కరమ్, డేవిడ్ మిల్లర్ అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మార్కరమ్, మిల్లర్ హాఫ్ సెంచరీలకు తోడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెత్త ఫీల్డింగ్ కూడా సౌతాఫ్రికాను విజయానికి దగ్గర చేసింది. రెండు సులవైన రనౌట్లను రోహిత్ శర్మ మిస్ చేస్తే.. మార్కరమ్ ఇచ్చిన ఒక సునాయసమైన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. మొత్తానికి ఇలా ముగిసిన మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. సులువైన రనౌట్లు, క్యాచ్‌లను కావాలనే మిస్ చేసి సౌతాఫ్రికాను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గెలిపించారని పాక్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫీల్డర్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ.. చాలా ఈజీ క్యాచ్‌ను వదిలేయడంపై మాత్రం పాక్ ఫ్యాన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇలాంటి క్యాచ్ వదిలేయడం ఏంటి? పాక్‌పై ఒంటిచేత్తో బౌండరీలైన్‌పై సిక్స్‌వెళ్తున్న బంతిని పట్టుకున్న కోహ్లీ ఈ క్యాచ్‌ను వదిలేయడం వెనుక ఏదో మతలబు ఉందని అనుమాన పడుతున్నారు. టీమిండియా ఫిక్సింగ్‌కు పాల్పడిందని అంటున్నారు. టీమిండియా ఓడిపోతే పాక్ అభిమానులు ఎందుకు ఇంతలా ఆవేదనకు గురవుతున్నారంటే.. టీమిండియా సౌతాఫ్రికాపై గెలిచి ఉంటే పాక్‌కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ.. భారత్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అందుకే ఫిక్సింగ్.. తొక్కా.. తొటకూర అంటూ పాక్ అభిమానలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.
Ab thoda ache se he match fixing kr lete!
Sore losers!#INDvsSA— Sunflowerqueen🌻 (@Can_you_feel__) October 30, 2022
The way Kohli was laughing after he dropped that catch makes you wonder if there’s something more sinister. Match fixing maybe?#INDvsSA
— P C (@PCleveau) October 30, 2022
Jab match fixing ki baat horahi thi surya kumar washroom chla gaya tha #INDvsSA
— Mahruk Muzaffar🌚 (@ElpisSssssS) October 30, 2022