సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సందర్భంలో కొన్ని కొన్ని వింతైన, సరదా సంఘటనలను చోటుచేసుకుంటాయి. అందులో లవ్ ప్రపోజల్స్, ముద్దులు, క్రికెటర్లకు పెళ్లి ప్రపోజల్స్ లాంటివి ఎక్కువగా కెమెరా కంటికి చిక్కుతుంటాయి. అదీకాక క్రికెటర్లు కొట్టిన భారీ సిక్స్ లకు చిన్నారి ప్రేక్షకులు గాయంపడ్డ సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. అయితే తాజాగా పాకిస్థాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓ రొమాంటికి డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో కెమెరాకి చిక్కింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఇది చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ యువతి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్-పాక్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బ్రిటీష్ బ్యాటర్లు పాక్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. సెంచరీల మోతమోగించారు. దాంతో ఇంగ్లాండ్ 506 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. అయితే అందరు ఇంగ్లాండ్ బ్యాటింగ్ నే చూసిన ఈ మ్యాచ్ లో ఓ రొమాంటిక్ కెమెరా మాత్రం మైదానం బయట డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియోను ఒడిసిపట్టుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. క్రీజ్ లో జో రూట్-పోప్ లు ఉండగా పాక్ బౌలర్ అలీ బౌలింగ్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే గ్రౌండ్ కు దగ్గర్లో ఉన్న డాబాపై ఓ యువతి డ్యాన్స్ చేస్తోంది.
దాంతో కెమెరామెన్ వీడియోను కాస్త ఆటవైపు నుంచి ఆమె వైపు తిప్పాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? ఆమె డ్యాన్స్ వేస్తున్నప్పుడు అక్కడ ఎవరూ సెల్ ఫోన్ లో చిత్రీకరించడంలేదు. దాంతో ఆ యువతి గ్రౌండ్ వైపే చూస్తూ డ్యాన్స్ చేసింది అని స్పష్టంగా తెలిసింది. దాంతో కెమెరా సైతం ఆమె డ్యాన్స్ అయిపోయేంతవరకు మైదానం వైపు తిప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో ఈ వీడియోపై కెమెరామెన్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వచ్చే ఐపీఎల్ కు ఈ కెమెరామెన్ ను తీసుకురావాలి అని కొందరంటే.. కెమెరా క్వాలిటీ మార్చండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Beautiful scenes pic.twitter.com/kmbEwh2uHA
— Out Of Context Cricket (@GemsOfCricket) December 1, 2022