క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించి అవినీతి నిరోధక చట్టానికి తూట్లు పోడిచినందుకు పాక్ క్రికెటర్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దేశవాళీ క్రికెట్‌తో పాటు పీఎస్‌ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్)లో కూడా ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడి మంచి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు సంపాదించుకున్న 32 ఏళ్ల ఆసిఫ్ అఫ్రిదీ అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై పాక్ క్రికెట్ బోర్డు రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4.10తో పాటు 2.4.4 నిబంధనలను ఉల్లంఘించడంతో అఫ్రిదీపై బ్యాన్ విధించారు. కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు అఫ్రిదీని సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని బోర్డుకు తెలియజేయనందుకు అతనిపై చర్చలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేథీ మాట్టాడుతూ..‘ఇలాంటి విషయంలో కఠినంగానే వ్యవహరించాలి. ఇతర ఆటగాళ్లకు ఇదో హెచ్చరికగా ఉండాలి. ఆటగాళ్లను వివిధ మార్గాల్లో అవినీతి ఆకర్షిస్తుండటం మన ఆటకు ప్రమాదకరం. ఇలాంటి విషయంలో ఆటగాళ్లకు అవగాహన కల్పిస్తూ.. నోటీసులు ఇచ్చినా.. వారి ప్రవర్తనలో మార్పు లేకపోతే పాక్ బోర్డు వారిని సహించదు.’ అని పేర్కొన్నారు. కాగా.. ఆసిఫ్ అఫ్రిదీ పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు, 2022లో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు అఫ్రిదీ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ.. తుది స్థానం దక్కలేదు. ఇక దేశవాళీ క్రికెట్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 118 వికెట్లు తీసి, 1303 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలో 42 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు పడగొట్టి, 576 రన్స్ చేశాడు.
BREAKING: Afridi Ban From All Foam of Cricket! #asifafridi #inaamiground pic.twitter.com/W3M56KD7IP
— Innami Ground Sports (@inaamiground) February 8, 2023