పాకిస్థాన్ స్పీడ్ గన్ హ్యారిస్ రౌఫ్ వివాహ బంధంలోకిఅడుగుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ మోడల్ ముజ్నా మసూద్ మాలిక్ ను నిఖా చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది, పాక్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత సెలక్టర్ షాహద్ ఆఫ్రీది, అతిఫ్ రాణా, ఆకిబ్ జావేద్ తదితరులు హాజరయ్యారు. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించారు. వీళ్ల పెళ్లి ఫొటోలను పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
నిఖా సందర్భంగా హ్యారిస్ రౌఫ్ తెల్లటి షేర్వానీలో ముస్తాబు కాగా, వధువు ముజ్నా బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిన వైట్ లెహంగాలో మురిసిపోయింది. వధూవరులిద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం వీరిపెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు క్రికెటర్లు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
❤️😍#harrisrauf #CoupleGoals pic.twitter.com/3SxVNYGNbe
— Hanan (@Honeych___) December 24, 2022
29 ఏళ్ల హ్యారిస్ రౌఫ్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరణాగ్రేటం చేశాడు. ఇప్పటివరకూ 57 టీ20లు, 15 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. టీ20 వరల్డ్ కప్ డెత్ ఓవర్లలో హ్యారిస్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ ఫైనల్ చేరడంతో అతని పాత్ర ఉంది. ఫైనల్లో అతను 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే.. హ్యారిస్ రౌఫ్ అనగానే మనందరకి గుర్తొచ్చేది విరాట కోహ్లీనే. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారిస్ వేసిన 18 ఓవర్‌లో చివరి రెండు బంతుల్లో కళ్లు చెదిరే సిక్సర్లు బాది జట్టుని గెలిపించాడు కోహ్లీ. బౌన్సర్ లా దూసుకొచ్చిన ఐదో బంతిని బ్యాక్ ఫుట్ లో స్ట్రైట్ సిక్స్ గా మలిచిన కోహ్లీ.. చివరి బంతిని స్క్వేర్ లెగ్ లో సిక్స్ గా మలిచి విజయానికి చేరువుగా చేశాడు. ఈ రెండు సిక్సుల గురుంచి యావత్ క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ చర్చించుకుంటోంది.
Haris Rauf at his Nikkah ceremony 🙌#PakistanCricket pic.twitter.com/S5HwDOFPIh
— Cricket Pakistan (@cricketpakcompk) December 24, 2022
Can’t wait to watch haris rauf’s wedding fan edits on the song”tenu takdaan rawaan baaton pe teri hasdaan rawaan” pic.twitter.com/cpAkaQA4u1
— Palwasha🐣 (@Cocomomo_456) December 24, 2022
All smiles at Haris Rauf’s Nikkah ceremony 💚#wedding pic.twitter.com/lOcPynFVzM
— Geo Super (@geosupertv) December 24, 2022