సాధారణంగా ఏ ఆటగాడికైనా కెరీర్ లో కొన్ని గడ్డుపరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో ఆ ప్లేయర్స్ తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగానూ ఉంటాయి. ఇక ఆటగాడు అన్నాక ఏదో ఒక సమయంలో ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తుంది. ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఓ స్టార్ ప్లేయర్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రాబోయే యువ ఆటగాళ్ల కోసంమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు.
178 ఇన్నింగ్స్ లు, 7097 పరుగులు.. 302 అత్యధిక వ్యక్తిగత స్కోర్ 35 అర్దశతకాలు, 19 శతకాలు.. క్రికెట్ లో ఇంతటి ఘనత సాధించిన ఆటగాడు తాజాగా తన ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.. అతడే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ అజార్ అలీ. ఇంగ్లాండ్ తో జరిగే చివరి టెస్ట్ మ్యాచే తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాడు. ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించాడు అలీ. తన రిటైర్మెంట్ గురించి అజార్ అలీ మాట్లాడుతూ..”నా దేశం తరపున ఆడటాన్ని నేను గొప్ప గౌరంవంగా భావిస్తున్నాను. ఎవరికైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది. రాబోయే యువ ఆటగాళ్ల కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇంగ్లాండ్ తో ఆడబోయే ఈ టెస్టే నాకు చివరి మ్యాచ్. ఇక నా కెరీర్ లో సహకరించిన అందరికి నేను రుణపడి ఉంటాను. నాకుటుంబం అండలేకుండా నేను ఇక్కడిదాక వచ్చేవాణ్ణి కాదు” అని అలీ అన్నాడు.
ఇక డ్రెస్సింగ్ రూమ్ లో నేను గొప్ప గొప్ప ఆటగాళ్లతో గడపటం నేను ఎప్పటికీ మర్చిపోనే అని అలీ చెప్పుకొచ్చాడు. ఇక నా అంతర్జాతీయ క్రికెట్ ను సంపూర్ణంగా ఆస్వాదించాను. ఇక పాక్ కెప్టెన్ గా వ్యవహరించడం నా జీవితంలో గొప్ప విషయం అని అలీ చెప్పుకొచ్చాడు. ఇక అజార్ అలీ కెరీర్ విషయానికి వస్తే.. 95 టెస్ట్ మ్యాచ్ ల్లో 7097 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 53 వన్డేల్లో 1845 రన్స్ చేశాడు. 3 శతకాలతో పాటుగా 12 అర్దశతకాలు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 14, 956 పరుగులు సాధించి.. పాకిస్థాన్ జట్టులో ఓ అదృశ్య యోధుడిగా ఉన్నాడు అజార్ అలీ.
Azhar Ali in Tests:
178 – innings
7097 – Runs
42.5 – Avg
302 – HS
35 – 50s
19 -100sThe silent warrior for Pakistan announced his retirement from international cricket.
(Final Test against England is his last match for men in green)@AzharAli_ | #CricketTwitter pic.twitter.com/B6bBSKq0tT
— CricTracker (@Cricketracker) December 16, 2022