ఆసీస్ స్టార్ క్రికెటర్ నాథన్ లియోన్ తన ప్రేయసి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎమ్మాను వివాహం చేసుకున్నాడు. తన మొదటి భార్య మెల్ వారింగ్ నుంచి లియోన్ 2017లో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్న ఎమ్మాతో లియోన్ ప్రేమలో పడ్డాడు.
ఇద్దరూ కొన్ని రోజులు డేటింగ్ చేసిన తర్వాత.. 2021లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఏడాది తర్వాత ఎప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని లియోన్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు. పెళ్లి డ్రెస్‌లోలో ఎమ్మాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. మిస్టర్ అండ్ మిస్సెస్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. లియోన్ చాలా మంది ఆసీస్ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఇటీవల శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లియాన్ మంచి ప్రదర్శన చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో లియోన్ 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయానికి బాటలు వేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్నాడు.
నాథన్ లియోన్ ఇప్పటివరకు 110టెస్టులు ఆడగా.. 20 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించాడు. అతని ఖాతాలో 438 వికెట్లున్నాయి. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత మూడో బౌలర్‌గా లియోన్ కొనసాగుతున్నాడు. మరి ఈ స్టార్ ప్లేయర్ రెండో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.