ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ లైయన్ గురించి ప్రత్యేకముగా పరిచయం అవసరం లేదు. రెడ్ బాల్ క్రికెట్ లో ఎన్నో ఏళ్లుగా ఆసీస్ జట్టు తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర వహించాడు. ఇక నేడు జరగబోయే యాషెస్ టెస్టులో సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నాడు.
ఒక ఆటగాడు టెస్టుల్లో డెబ్యూ చేయడం ఒక కళ. ఇక 100 టెస్టులు ఆడడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. ఇక వరుసగా 100 టెస్టులు ఆడడం అనేది మామూలు విషయం కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచులో వరుసగా 100 టెస్టులు ఆడాలంటే ఫిట్ నెస్ తో పాటు ఫామ్ ని కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఇవన్నీ అధిగమించి ఇలాంటి ఫీట్ నమోదు చేయడం అనేది కొంతమంది ప్లేయర్లకే సాధ్యం అవుతుంది. ఇలాంటి లిస్టులో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. తాజాగా ఆసీస్ స్పిన్నర్ లైయన్ కూడా వచ్చి చేరిపోయాడు. అయితే లైయన్ కి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ లైయన్ గురించి ప్రత్యేకముగా పరిచయం అవసరం లేదు. రెడ్ బాల్ క్రికెట్ లో ఎన్నో ఏళ్లుగా ఆసీస్ జట్టు తరపున ఎన్నో విజయంలో కీలక పాత్ర వహించాడు. ఆసీస్ ఎక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడినా కానీ లైయన్ మాత్రం కామన్ గా ఉండాల్సిందే. ప్రస్తుతం 500 వికెట్ల క్లబ్ కి చేరువలో ఉన్న ఈ ఆసీస్ ఆఫ్ స్పిన్నర్.. వరుసగా 100 టెస్టు మ్యాచులాడిన ఏకైక బౌలర్ గా నిలవనున్నాడు. ఇప్పటివరకు కొంతమంది ప్లేయర్లు వరుసగా 100 టెస్టు మ్యాచులు ఆడినా వారందరూ బ్యాటర్లు కావడం గమనార్హం. యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో జరిగే టెస్టు మ్యాచ్ లైయన్ కెరీర్ లో 100 వది. తొలి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటకి అడ్డుకట్ట వేసి ఆస్ట్రేలియాని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక లార్డ్స్ లో జరగనున్న రెండో టెస్టు కోసం ఎంతో అతృత్తగా ఎదరు చూస్తున్నాని చెప్పుకొచ్చాడు. మొత్తానికి వరుసగా 100 టెస్టు మ్యాచులాడిన తొలి బౌలర్ గా నిలిచిన లైయన్ రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.