కంగారూల జట్టులో టాప్ 7 బ్యాటర్లు గత కొన్నేళ్లుగా అత్యున్నత ఆటను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి టాప్ 5 బ్యాటర్లను చూసుకుంటే వార్నర్ మినహా మిగిలినా వారందరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డుని నెలకొల్పారు.
టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంత మంచి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కంగారూల జట్టులో టాప్ 7 బ్యాటర్లు గత కొన్నేళ్లుగా అత్యున్నత ఆటను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి టాప్ 5 బ్యాటర్లను చూసుకుంటే వార్నర్ మినహా మిగిలినా వారందరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇక తాజాగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ ఘన విజయం సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ లో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి? ఆ బ్యాటర్స్ ఎవరు?
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు బ్యాటర్లు టాప్ 3 ఓ నిలవడం విశేషం. మార్నస్ లబుషేన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ టెస్టులో 163 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ట్రావిస్ హెడ్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. దీంతో ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-3లో నిలవడం 1984 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. అంతే కాదు ఆసీస్ ఓపెనర్ ఖవాజా కూడా 9 స్థానంలో నిలవడం ద్వారా టాప్ 10 లో నలుగురు ఆసీస్ ఆటగాళ్లు నిలిచినట్లైంది.
39 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. మళ్లీ ఇన్నాళ్లకు లబుషేన్ (903), స్టీవ్ స్మిత్ (885), ట్రావిస్ హెడ్ (884) ఆ ఘనత సాధించారు. ఇక భారత్ తరపున రిషబ్ పంత్ ఒక్కడే టాప్ 10 స్థానంలో నిలిచి టాప్ 10 లో చోటు సంపాదించాడు. మొత్తానికి టెస్టు ర్యాంకింగ్స్ లో వరుసగా మూడు స్థానాలు ఆసీస్ బ్యాటర్లు కావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.